Sajjala on TDP activities: మోసం చేయడంలో సరికొత్త టెక్నిక్‌లన్నీ టీడీపీకి తెలుసని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దొంగల పార్టీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో? అని అనుమానం వ్యక్తం చేశారు. పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోందని, పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోందన్నారు. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సజ్జల రామకృష్ణా రెడ్డి కోరారు. నిన్న వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (Sajjala on TDP activities)
* చంద్రబాబుకు అమలు చేయాలని ఉద్ధేశం లేని హామీలు ఇచ్చారు
* హామీల అమలేవని అడుగుతారని వెబ్‌సైట్ నుంచి తొలగించారు
* ఓటర్ ఐడీ కార్డు తీసుకొని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు
* వ్యక్తిగత సమాచారం సేకరించి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు
* 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు
* చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తూ నిలువు దోపిడీకి ప్రయత్నాలు
* సేవామిత్ర పేరుతో టీడీపీ అన్ని వివరాలు సేకరించింది
* అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారం సేకరించారు
* ఈ డేటాతో టీడీపీ బ్లాక్ మెయిల్ చేయచ్చు, లేదా ఏమైనా చేయచ్చు
* చంద్రబాబు ఆలోచనలు ఎంత వికృతమైనవో దీని ద్వారా తెలుస్తోంది
* మనిషికి ఏవైతే ఉండకూడదో అన్ని చంద్రబాబుకు ఉన్నాయి
* అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఓటర్లను ప్రలోభానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు
* ఓటర్ల డేటా మొత్తం చంద్రబాబు దగ్గర ఉంది
* ఓటర్ల వ్యక్తిగత సమాచారం చంద్రబాబు దగ్గర ఉండటం ప్రమాదకరం
* ఎదుటివారిని మోసం చేసి ఆనందం పొందే వ్యక్తి చంద్రబాబు
* ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈనాడు తప్పుడు కథనాలు
* ఓట్లను తొలగిస్తున్నారని ఈనాడు అసత్య వార్తలు
* అడ్డదారుల్లో అధికారంలోకి రావడానికి ఓట్లను గత టీడీపీ ప్రభుత్వం తొలగించింది
* ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తెచ్చేందుకు రకరకాలుగా వార్తలు రాస్తున్నారు
* సిటిజన్ ఫర్ డెమొక్రసీ తరఫున రూ.కోట్లు తీసుకునే లాయర్లను ఎలా పెట్టుకోగలిగారు?
* వీరి వెనుక చంద్రబాబు ఉన్నారనే సంగతి అందరికీ తెలుసు
* చంద్రబాబుకు ఇంత దౌర్భాగ్యం ఎందుకు?
* చేయగల పనులను ప్రజలకు చెప్పి ఓట్లు అడిగితే ఈ దౌర్భాగ్యం ఉండదు కదా?
* అడ్డదారులు, గోడ దూకటాలు ఎందుకు చంద్రబాబూ?
* చంద్రబాబు అనే వ్యక్తి ఫేక్
* రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా మోసం చేశారు
* రుణమాఫీ చేయలేమనే సీఎం జగన్ ప్రకటించలేదు
* చేయగలిగిన పనులనే సీఎం జగన్ చెప్పారు
* అన్ని రోగాల పేర్లు చెప్పుకుని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు….సత్యమేవ జయతే అని చెప్పుకుంటున్నారు
* ఓట్లను తొలగించాలనే కుట్ర పై అప్రమత్తంగా ఉండాలి
* టీడీపీ చేస్తున్న ఆ కుట్రల పై తగిన చర్యలు తీసుకుంటాం.
Read Also : CM Jagan relesed ONGC Compensation: 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకున్నాం: సీఎం జగన్
