HomeAndhra PradeshCS Jawahar Reddy: రక్తహీనత, పౌష్టికాహార లోపాల నివారణకు తక్షణ చర్యలు

CS Jawahar Reddy: రక్తహీనత, పౌష్టికాహార లోపాల నివారణకు తక్షణ చర్యలు

CS Jawahar Reddy: రాష్ట్రంలో గర్బిణీలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోప నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, విద్యా శాఖలకు సంబంధించి నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తహీనత, పౌష్టికాహార లోపం గల బాలింతలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. తద్వారా వారిని ఆ సమస్యల నుంచి విముక్తుల్ని చేయొచ్చన్నారు. (CS Jawahar Reddy)

హైరిస్క్ ప్రెగ్నెంట్ మహిళల డేటాను అందుబాటులో ఉంచుకుని వారి ఆర్యోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా మానిటర్ చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం, పౌష్టికాహార లోపాన్ని నివాకరేంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు.

* డిసెంబర్‌ నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని ప్రవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు పూర్తి చేసేలా ఆయా విద్యా సంస్థల యమాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలి.
* ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో రక్త హీనణ నివారణకు స్క్రీనింగ్ పరీశక్షలు నిర్వహించి వారిచే ఐరన్ ఫోలిక్ మాత్రలు మింగించే చర్యలు తీసుకుంటున్నవిధంగానే ప్రవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా ఈవిధమైన ఏర్పాట్లు చేయాలి.

* ప్రతి నెల మొదటి మూడవ శుక్రవారాల్లో విలేజ్ హెల్తు అండ్ న్యూట్రిషన్ డేను క్రమం తప్ప కుండా నిర్వహించడం ద్వారా వివిధ ఆరోగ్య అంశాలపై ప్రజల్లో పెద్దఎత్తున్న అవగాహన పెంపొందించాలి.
* బాల్య వివాహాల నియంత్రణపై కూడా వారిలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
* గ్రామ స్థాయి హెల్తీ బేబీ షోలు వంటివి నిర్వహించాలి. ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ప్రత్యేకంగా అవార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

* వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇప్పటి వరకూ వివిధ అంశాల్లో సాధించిన లక్ష్యాలను వివరించారు.
* మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి మాట్లాడుతూ పెరుగుదల సరిగా లేని, ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు గల పిల్లల్లో ఆలోపాలను నివారించేందుకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఐరన్ ఫోలిక్ సిరప్,టేక్ హోం రేషన్ కిట్లు పంపిణీతో పాటు వండిన ఆహారాన్ని అందించడం జరుగుతోందన్నారు.

ఇదీ చదవండి: CM Jagan Review on Women welfare: గ్రామ స్థాయిలోనే రక్తహీనత నివారణ, పౌష్టికాహారం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు