HomeAndhra PradeshWeather Report Now: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన

Weather Report Now: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు వర్ష సూచన

Weather Report Now: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగొ పొర్లుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడడంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 4 జిల్లాలకు ఆరెంజ్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. (Weather Report Now)

విశాఖ, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరుకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేశారు. కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా ఏపీలో 14 జిల్లాలకు హైఅలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పెన్నా నదికి భారీగా వరద ఉద్ధృతి పెరిగింది. వైయస్సార్‌ జిల్లా చెన్నూరు దగ్గర వరదలో చిక్కుకున్న 8 మంది యువకుల్లో ముగ్గురిని సురక్షితంగా అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడారు. మరో ఐదుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వైయస్సార్‌ జిల్లా జమ్మలమడుగు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.: రాజుపాలెం మండలంలో మడువంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజుపాలెం – చాగలమర్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

బాపట్ల పరిధిలో అల్పపీడనం ప్రభావంతో అద్దంకి నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పడుతోంది.

ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీలో దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు చోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు రాయలసీమ జోన్ ఎస్‌ఐ అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్ వాయిదా పడింది. కర్నూలులో భారీ వర్షం కారణంగా ఈనెల 21కి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

Read Also : Modi on G20: జీ-20 సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు