Tirumala Samacharam (20-07-2023): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. నడక దారిలోనూ భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,024 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లు చేకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. (Tirumala Samacharam (20-07-2023):
Read Also : Gold Price today 20 July 2023: మరోసారి భారీగా పెరిగిన పసిడి.. నేడు బంగారం, వెండి ధరలు..
గడచిన జూన్ మాసంలో సుమారు 23 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.116.14 కోట్లు చేకూరిందని టీటీడీ తెలిపింది. 1.06 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయం చేసినట్లు పేర్కొంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు 10.8 లక్షల మంది శ్రీవారికి తలనీలాల్ని మొక్కుగా చెల్లించుకున్నారని టీటీడీ వెల్లడించింది.
Read Also : Deepam: మహిళలు పుట్టింటి నుంచి దీపం తెచ్చుకుంటే ఏమవుతుంది? ఫలితాలు ఎలా ఉంటాయి?
