నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే, బాలయ్య (Nandamuri Balakrishna) నటించిన చిత్రాల్లో బాక్సీఫాసు వద్ద బోల్తా కొట్టిన చిత్రాల లిస్టు కూడా పెద్దదిగానే ఉంది. ఓ సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? అని ముందే అంచనాకు రావడం చాలా కష్టమైన పని. సినిమా విడుదలై టాక్ వస్తేగానీ ఏ విషయం చెప్పలేం. కథ, కథనం, హీరో నటన, కామెడీ, డాన్స్, పాటలు, నేపథ్య సంగీతం.. ఇలా అనేక అంశాలపై సినిమా హిట్ అయ్యేదీ, ప్లాప్ అయ్యేదీ ఆధారపడి ఉంటుంది.
బడా హీరోల విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా డిజాస్టర్ గా నిలిచే ప్రమాదం ఉంటుంది. ఫ్యాన్స్ ఆగ్రహం, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, థియేటర్ల ఓనర్లు.. ఇలా చాలా నష్టాలు భరించాల్సి వస్తుంది. ఇలాంటి ఎంపికలు, పొరపాట్లు చేసినందుకేనేమో.. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కొన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. బాలయ్య (Nandamuri Balakrishna) సాధారణంగా కొత్త దర్శకులైనా, పాత దర్శకులైనా సినిమా ఒప్పేసుకుంటూ ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ బలహీనతతోనే బాలయ్యను ప్రయోగాలకు వాడుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయని చెబుతున్నారు.
బాలకృష్ణ తన కెరీర్ లో నటించిన 20 సినిమాలు ప్లాప్ లిస్టులో ఉన్నాయి. జననీ జన్మభూమి, కత్తుల కొండయ్య, అల్లరి కృష్ణయ్య, సాహస సామ్రాట్, ప్రాణానికి ప్రాణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, గాండీవం, నిప్పురవ్వ, దేవుడు, కృష్ణబాబు, వంశోద్ధారకుడు, పలనాటి బ్రహ్మనాయుడు, విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, శ్రీమన్నారాయణ, మహారథి, ఒక్కమగాడు, పరమవీర చక్ర, రూలర్ తదితర చిత్రాలు ఆల్ టైమ్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..
చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకోవడం ఎంత కామనో.. విడిపోవడం కూడా అంతే కామన్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సినిమా వాళ్ల వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. సినిమాల్లో హిట్ కొడుతున్నా వ్యక్తిగతంగా ఫెయిల్యూర్ అవుతుంటారు చాలా మంది స్టార్లు. వీళ్ల జీవితాల గురించిన పుకార్లు, గాసిప్స్ అందరికీ ఆసక్తికరంగానే ఉంటాయి. మంచి సమయం, మంచి సెలబ్రిటీని చూసుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే, వ్యక్తిగత జీవితంలో అనేక అంశాలపై ఇగో సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి ఒకరంటే ఒకరికి పొసగక విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు.
వీరిలో పవన్ కల్యాణ్ ఒకరు. పవన్ మొదట నందినిని పెళ్లాడారు. కొంత కాలానికి వీరిద్దరూ విడిపోగా, తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేశారు పవన్. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నారు. అటు తర్వాత రేణు దేశాయ్ కి విడాకులిచ్చిన పవన్.. రష్యా నటి అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.
లోకనాయకుడిగా పేరు గాంచిన కమల్ హాసన్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తొలుత వాణి గజపతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చి సారికను పెళ్లి చేసుకకున్నాడు. అనంతరం గౌతమితో సహజీవనం చేశాడు. ఇప్పుడు ఈమెతో కూడా విడిపోయాడు కమల్. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారి జాబితాలో ఉన్నాడు.
ఫస్ట్ రిచా శర్మ, తర్వాత రియా పిళ్లై, మూడో పెళ్లి మాన్యతతో జరిగింది. హీరోయిన్ రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మొదట రీనా దత్తాను, తర్వాత కిరణ్ రావును, ఇప్పుడు ఫాతిమా సనా షేక్ ను వివాహం చేసుకున్నాడు. ఈ జాబితాలో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కూడా ఉన్నారు. కిశోర్ కుమార్ నాలుగు వివాహాలు చేసుకోవడం విశేషం.
Read Also : Prabhas: మీకు తెలుసా..? ప్రభాస్‌ను ఓ హీరోయిన్ అన్నా అని పిలిచింది..!
