HomeBusinessPhone Pay: ఫోన్‌ పే వాడుతున్నారా? ఈ గుడ్‌ న్యూస్‌ తెలుసా? యాక్టివేట్‌ చేసుకోండిలా!

Phone Pay: ఫోన్‌ పే వాడుతున్నారా? ఈ గుడ్‌ న్యూస్‌ తెలుసా? యాక్టివేట్‌ చేసుకోండిలా!

ఫోన్‌ పే (Phone Pay) యూజర్లకు గుడ్‌ న్యూస్. మనదేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్‌ లావాదేవీలు, పేమెంట్లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. గూగుల్‌ పే, ఫోన్‌ పే (Phone Pay), పేటీఎం, తదితర ప్లాట్‌ఫామ్‌లు తొలుత వచ్చాయి. తర్వాత ప్రతి బ్యాంకింగ్‌ సంస్థ కూడా తమ తరఫున డిజిటల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి. యూపీఐ సేవలను ప్రారంభించిన ఎన్‌పీసీఐ ఇటీవల యూపీఐ లైట్‌ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఎవరు చూసినా యూపీఐ లైట్‌ సేవలను అమితంగా లైక్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఫోన్‌ పే (Phone Pay) కూడా యూపీఐ లైట్‌ సేవలను తీసుకొచ్చింది.

ఫోన్‌పే తన యాప్‌లో యూపీఐ లైట్ ఫీచర్‌‌ను ప్రవేశపెట్టినట్లు తాజాగా ప్రకటించింది. ఈ సేవలకు అన్ని ప్రధాన బ్యాంకులు కూడా సపోర్ట్‌ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారులంతా యూపీఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఈ ఫీచర్ ఆన్-డివైస్ బ్యాలెన్స్ ద్వారా వర్క్‌ చేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే బిజినెస్‌ టైమ్‌లో కూడా కిరాణా, రవాణా వంటి తక్కువ విలువైన ట్రాన్జాక్షన్ల కోసం ఫాస్ట్‌ అండ్‌ సెక్యూర్‌గా చెల్లింపులు చేసేందుకు వీలు కలుగుతుంది. యూపీఐ లైట్‌ ద్వారా చెల్లింపులు జరిపే వారికి త్వరగా పేమెంట్‌ పూర్తి చేయడం సులభమవుతుంది.

ఇక యూపీఐ లైట్‌ ఫీచర్‌ ద్వారా రూ.200, అంతకంటే తక్కువ చెల్లింపులను ప్రారంభించేందుకు వినియోగదారులను పర్మిషన్‌ ఉంటుంది. పిన్‌ను ఎంటర్‌ చేయాల్సిన పని కూడా ఉండదు. నేరుగా వారి యూపీఐ లైట్ అకౌంట్‌ నుంచి కస్టమర్లు బ్యాంకుల (రిమిటర్ బ్యాంక్) కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లను రియల్ టైమ్‌లో ప్రమేయం చేయకుండా ఆన్-డివైస్ యూపీఐ లైట్ బ్యాలెన్స్‌ను డెబిట్ చేయవచ్చు. దీని ద్వారా లావాదేవీ నేరుగా ప్రాసెస్ అవుతుంది. ఫోన్‌ పే కస్టమర్లు తమ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని వెంటనే ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. యాక్టివేషన్‌ కూడా ఈజీగా అయిపోతుంది.

యూపీఐ లైట్ అకౌంట్‌ను రూపొందించుకొని వినియోగదారులు రూ.2000 వరకు డబ్బును లోడ్ చేసుకొనే వీలుంటుంది. ఒకేసారి రూ.200 లేదా అంతకంటే తక్కువను లావాదేవీలను అత్యంత ఫాస్ట్‌ అండ్‌ ఈజీగా చేసే సౌలభ్యం కలుగుతుంది. వినియోగదారులు రోజూ యూపీఐ ట్రాన్జాక్షన్‌ హిస్టరీ కలిగి ఉన్న ఎస్ఎంఎస్‌ను పొందుతారు. ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి మాట్లాడుతూ.. యూపీఐ అనేది యూపీఐ స్టాక్ సమర్పణలో ప్రధాన భాగంగా ఉంటుందని వివరించారు.

ఈ మధ్య తక్కువ మత్తంలో లావాదేవీలు జరిపే వారు అధికంగా ఉంటున్నారని తెలిపారు. వారి కోసం డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించామని వెల్లడించారు. ముఖ్యంగా యూపీఐ లైట్ ఇప్పటికే ఉన్న యూపీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఒత్తిడి లేకుండా లావాదేవీలను వాటిని వేగంగా, సౌకర్యవంతంగా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read Also : Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రికార్డు.. మార్చి త్రైమాసికంలో 137.5 శాతం లాభం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు