సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan Press Meet: రేపు తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కీలక ప్రెస్‌మీట్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 22 జనవరి 2026
YS Jagan press meet

YS Jagan Press Meet: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు (జనవరి 22, 2026 – గురువారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రెస్‌మీట్ జరగనుంది.

సమకాలీన రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై వైయస్ జగన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడనున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఈ ప్రెస్‌మీట్‌పై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజాసమస్యలు, పాలన తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరగనున్న ఈ సమావేశానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యాచరణ, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కూడా వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేపటి ప్రెస్‌మీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చదవండి: YS Jagan : ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే.. పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
Bhogapuram Airport : ఏపీ అభివృద్ధిలో మైలురాయి.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మా హయాంలో బలమైన పునాది వేశాం: జగన్ ట్వీట్

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading