Rain Alert for AP TS: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తుండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాబోయే 5 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. (Rain Alert for AP TS)
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ఐఎండీ బులెటిన్ విడుదల చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరింత బలపడుతోందని పేర్కొంది.
బంగాళాఖాతంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని తుపాను ఆవర్తనం
బంగాళాఖాతంలో ఉత్తరాంధ్రకు ఆనుకుని తుపాను ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండికి వాయుగుండంగా మారే సూచనలున్నాయని పేర్కొంది. ఇక ఉత్తరాంద్ర, దక్షిణ ఒడిశా మీదుగా వాయవ్యదిశగా కదిలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
తుపాను ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం తెలంగాణ కోస్టల్, కర్ణాటక రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 18 సెం.మీ వర్షపాతం నమోదైంది. గుడివాడలో 9, మచిలీపట్నం, పార్వతీపురం జిల్లాలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐంఎండీ వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కోస్తా భాగాల్లో వర్షాల జోరు పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ పేర్కొన్నారు. అనకాపల్లి టౌన్ పరిసరాలు, ముఖ్య భాగాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా రణస్ధలం వైపుగా భారీ వర్షాలు వ్యాప్తి చెందాయన్నారు. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు..
రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. అయితే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
⚠️గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
⚠️పొలవరం వద్ద నీటిమట్టం 11.97 మీటర్లు
⚠️ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.06 లక్షల క్యూసెక్కులు
⚠️సహాయ చర్యల కోసం 2NDRF, 4 SDRF బృందాలు
⚠️గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
~ ఏపీ విపత్తుల సంస్థ. pic.twitter.com/MkvMZicJhq— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) July 24, 2023
Read Also : Karnataka Viral Video: కర్ణాటకలో విషాదం.. వీడియో కోసం జలపాతం వద్దకు వెళ్లి కొట్టుకుపోయిన యువకుడు..