Unitree Robots: మనుషులు డ్యాన్స్ చేస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం సహజం. కానీ అదే స్టేజ్‌పై మనుషులతో పాటు హ్యూమనాయిడ్ రోబోలు కదలికలు వేస్తే? అందులోనూ డ్యాన్స్‌తో పాటు కిక్స్, పంచ్‌లు, కుంగ్‌ఫూ స్టెప్పులు, బ్యాక్‌ఫ్లిప్స్‌ను సమన్వయంతో ప్రదర్శిస్తే? అమెరికా టీవీ షో America’s Got Talent Season 21లో ఇదే జరిగింది. చైనాకు చెందిన డ్యాన్సర్ వు యుఫెయ్‌తో కలిసి Unitree హ్యూమనాయిడ్ రోబోలు చేసిన ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. న్యాయనిర్ణేత సోఫియా వెర్గారా గోల్డెన్ బజర్ నొక్కేలా చేసింది.
రోబోలతో రచ్చ చేసిన డ్యాన్స్
స్టేజ్‌పై వు యుఫెయ్, Unitree G1 రోబోలు కలిసి ప్రదర్శించిన డ్యాన్స్ సాధారణ రోబోటిక్ మూవ్‌మెంట్స్‌కు భిన్నంగా సాగింది. మనుషుల డ్యాన్సర్లతో సమన్వయం చేసుకుంటూ రోబోలు ఒకే రిథమ్‌లో కదలికలు ప్రదర్శించాయి. సింక్రనైజ్డ్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటు కిక్స్, పంచ్‌లు, మార్షల్ ఆర్ట్స్ మూమెంట్స్, కుంగ్‌ఫూ స్ఫూర్తితో రూపొందించిన స్టెప్పులు, బ్యాక్‌ఫ్లిప్స్ కూడా ఇందులో భాగమయ్యాయి. రోబోలు సంప్రదాయ చైనీస్ దుస్తులు ధరించడంతో టెక్నాలజీ, డ్యాన్స్, చైనా సంస్కృతి ఒకే వేదికపై కలిసినట్లైంది. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చకు వచ్చాయి.
గోల్డెన్ బజర్‌తో కీలక మలుపు
క్వార్టర్‌ఫైనల్స్‌లో Unitree ప్రదర్శన పూర్తయ్యాక న్యాయనిర్ణేతల నుంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా సోఫియా వెర్గారా ఈ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆ రాత్రి ఆమెకు ఉన్న Live Golden Buzzerను Unitree కోసం ఉపయోగించారు. దీంతో Unitree బృందానికి తదుపరి రౌండ్లలో ఓటింగ్ ద్వారా అవకాశం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫైనల్స్‌లో స్థానం లభించింది. Season 21లో క్వార్టర్‌ఫైనల్స్ సమయంలో గోల్డెన్ బజర్ ద్వారా నేరుగా ఫైనల్‌కు వెళ్లిన నాలుగు యాక్ట్స్‌లో Unitree కూడా ఒకటిగా నిలిచింది.
టెక్నాలజీ వెనుక డ్యాన్స్
Unitree ప్రదర్శనలో కనిపించిన కదలికలు కేవలం ముందుగా ప్రోగ్రామ్ చేసిన సాధారణ రోబోట్ మూవ్‌మెంట్స్ మాత్రమే కాదు. డ్యాన్స్‌ను రోబోటిక్ సిస్టమ్‌లకు అనుగుణంగా మార్చడం, మానవ కదలికలను అధ్యయనం చేయడం, సిమ్యులేషన్ ద్వారా వాటిని పరీక్షించడం, మోటార్ కంట్రోల్‌ను సర్దుబాటు చేయడం వంటి అనేక దశలు ఈ తరహా ప్రదర్శన వెనుక ఉంటాయి. ముఖ్యంగా వేగవంతమైన రొటేషన్స్, పవర్ మూవ్స్ వంటి కదలికల్లో రోబోట్ల మోటార్ పవర్, టార్క్ కంట్రోల్ కీలకంగా ఉంటుంది. అదే సమయంలో మానవ డ్యాన్సర్‌ల మాదిరిగా శరీరాన్ని సహజంగా వంచే ఫ్లెక్సిబుల్ మూవ్‌మెంట్స్ మాత్రం రోబోట్లకు ఇప్పటికీ ప్రత్యేకమైన సాంకేతిక సవాలుగా ఉంటాయి.
రోబోలను చూస్తే భయమే
రోబోలతో కలిసి పనిచేసిన అనుభవం తన ఆలోచనా విధానాన్నే మార్చిందని వు యుఫెయ్ వెల్లడించాడు. మొదట అవి కేవలం యంత్రాలుగానే అనిపించాయని, కానీ వాటితో ఎక్కువ సమయం కలిసి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక రకమైన టీమ్ స్పిరిట్ అనిపించిందని చెప్పాడు. మనిషి-రోబో మధ్య స్టేజ్‌పై సమన్వయం సాధించడం ప్రత్యేకమైన అనుభూతి అని అతడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ పలు కథనాలు పేర్కొన్నాయి. అదే సమయంలో రోబోలు కొత్త కదలికలను నేర్చుకున్న తర్వాత వాటిని ఇతర రోబోలకు వేగంగా పునరావృతం చేయగల సామర్థ్యం తనకు ఆశ్చర్యం కలిగించిందని వు యుఫెయ్ వివరించాడు.
ఫైనల్‌లో రోబోల ప్రదర్శన
Unitree ప్రయాణం కేవలం ఒక టీవీ షోలో వినోద ప్రదర్శనగా మాత్రమే కాకుండా.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ సామర్థ్యాలను భారీ ప్రేక్షకుల ముందు చూపించిన వేదికగా కూడా మారింది. డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, మానవ-యంత్ర సమన్వయం కలిపి రూపొందించిన ఈ యాక్ట్‌కు లభించిన గోల్డెన్ బజర్‌తో ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఇప్పటికే Season 21 ఫైనల్‌కు Unitree అధికారికంగా చేరింది. దీంతో తుది వేదికపై వు యుఫెయ్, హ్యూమనాయిడ్ రోబోలు ఎలాంటి కొత్త మూవ్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాయన్న ఆసక్తి నెలకొంది. మానవ కళను రోబోటిక్స్ సామర్థ్యంతో కలిపిన ఈ ప్రయోగం.. భవిష్యత్తులో వినోద రంగంలో హ్యూమనాయిడ్ రోబోలు ఏ స్థాయిలో భాగస్వాములవుతాయనే చర్చకు కూడా దారితీస్తోంది.
Read also: Viral Childhood Photo: ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?
Ranabaali Movie: రణబాలి సెట్‌లో స్పెషల్ మూమెంట్.. రష్మికకు విజయ్ దేవరకొండ Special హగ్ viral






