Arunachala Giri Pradakshina: మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ గురించి తెలుగు వారందరికీ తెలిసే ఉంటుంది. సుమారు 14 కిలోమీటర్లకుపైగా కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు భక్తులు. ప్రతి పౌర్ణమినాడు అత్యంత భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులు అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. పౌర్ణమి వచ్చిందంటే ఇక అరుణాచల కొండ భక్తులతో కిటకిటలాడాల్సిందే. ఇక్కడ గిరిప్రదక్షిణ చేసి మొక్కుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల అచంచల విశ్వాసం. ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన భక్తులే అధికంగా కనిపిస్తుంటారు.
అరుణాచలేశ్వరుని సన్నిధికి వెళ్లాలనుకొనే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపికబురు చెప్పంది. గిరిప్రదక్షిణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తారు కాబట్టి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసింది టీఎస్ ఆర్టీసీ. జూలై 3వ తేదీన అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆ ప్యాకేజీ పూర్తి వివరాలను టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధనన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ చేయాలనుకొనే భక్తులంతా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
టూర్ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవీ…
* అరుణాచల గిరి ప్రదక్షిణను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ ప్యాకేజీలా అందిస్తోంది. బస్సు సర్వీస్ నంబర్ 98889 జూలై రెండో తేదీన ఉదయం 6 గంటలకు హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వద్ద నుంచి బయల్దేరుతుంది.
* టూర్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం వినాయక స్వామి దర్శనం కూడా ఉంటుంది. అనంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచల క్షేత్రానికి బస్సు చేరుకుంటుంది.
* అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ పూర్తి కాగానే జూలై 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడు రాష్ట్రం వెల్లూర్‌లోని స్వర్ణ దేవాలయానికి బస్సు చేరుకుంటుంది. అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అటు తర్వాత మరుసటి రోజు జూలై 4వ తేదీన ఉదయం 10 గంటలకల్లా హైదరాబాద్‌కు బస్సు చేరుకుంటుంది.
* మొత్తంగా ఈ ప్యాకేజీ ధరను ఒక్కొక్కరికి రూ.2,600గా టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్యాకేజీని ఆర్టీసీ అధికారిక వెబ్‌సైటు http://tsrtconline.in లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకొనే సౌలభ్యం కల్పించారు.
* ఈ బస్సు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లతో పాటు సమీపంలో ఉన్న టీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకొనే సౌకర్యం ఉంటుంది.
* ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన మరింత సమాచారం కోసం 99592 26257, 99592 24911 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
2023 అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరిప్రదక్షిణ తేదీలు ఇవీ..
* జూన్ 3వ తేదీ, శనివారం ఉదయం 11.17 నుంచి 4వ తేదీ ఆదివారం ఉదయం 9.11 గంటల వరకు.
* జూలై 2వ తేదీ ఆదివారం రాత్రి 8.21 గంటల నుంచి 3వ తేదీ సోమవారం సాయంత్రం 5.10 గంటల వరకు.
* ఆగస్టు 30వ తేదీ బుధవారం ఉదయం 10.50 గంటల నుంచి 31వ తేదీ గురువారం సాయంత్రం 7.05 గంటల వరకు.
* సెప్టెంబర్ 28వ తేదీ గురువారం సాయంత్రం 6.50 గంటల నుంచి 29వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3.27 గంటల వరకు.
* అక్టోబర్ 28వ తేదీ శనివారం ఉదయం 2.03 గంటల నుంచి 29వ తేదీ ఆదివారం ఉదయం 2.03 గంటల వరకు.
* నవంబర్ 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 03.10 గంటల నుంచి 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం 02.10 గంటల వరకు.
* డిసెంబర్ 26వ తేదీ మంగళవారం 4.56 గంటల నుంచి 27వ తేదీ బుధవారం ఉదయం 5.01 గంటల వరకు.
Read Also : Devotional Tips Deepalu: దీపాలను ఆర్పే విధానం తెలుసా? అగ్గిపుల్లను కూడా ఇలా ఆర్పేయరాదు!