CM KCR: కేంద్రంలోని బీజేపీ సర్కార్ (BJP Govt) తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM KCR) కె.చంద్రశేఖర్‌రావు (CM KCR) మరోసారి మండిపడ్డారు. ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వెళ్తోందని, ఎమర్జెన్సీని వ్యతిరేకించే బీజేపీ నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్నారంటూ కేసీఆర్ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi CM Kejriwal) వచ్చారు. ఆయనతోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ (Punjab CM Bhagawanth Mann) కూడా వచ్చారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని, దీన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో (Parliament) గళం విప్పాలని విపక్ష నేతలను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు కోసం ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్డినెన్స్ తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని చెప్పారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించిన కేజ్రీవాల్.. అద్భుత విజయం సాధించారని కేసీఆర్ మెచ్చుకున్నారు. ప్రజా మద్దతుతో గెలుపొందిన ప్రభుత్వంపై కేంద్రం కక్షసాధింపులకు పాల్పడటం దారుణమన్నారు.
ఢిల్లీ ప్రజా ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వేధింపులకు గురి చేస్తోందని ఆక్షేపించారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని, ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిందని కేసీఆర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తెచ్చిందని గుర్తు చేశారు.
గవర్నర్ల వ్యవస్థతో ఏదో చేయాలని ప్రయత్నాలు..
అలంకారప్రాయమైన గవర్నర్ల వ్యవస్థతో మోదీ ప్రభుత్వం ఏదో చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. రాజ్‌భవన్‌లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని కేసీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా మారారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా.. బీజేపీ నేతలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. త్వరలో దేశం మొత్తం కూడా బీజేపీకి గుణపాఠం తప్పదని కేసీఆర్ జోస్యం చెప్పారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఆగడాలు మితిమీరిపోతున్నాయి… ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్ pic.twitter.com/2wt6cKieE5
— BRS Party (@BRSparty) May 27, 2023
రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న కేంద్రం..
ఇక ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల విషయంలో తమ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. ఢిల్లీ ప్రజలను మోదీ తీవ్రంగా అవమానిస్తున్నారని విమర్శలు చేశారు. దేశంలో కూడా బీజేపీ అరాచకాలు పెరిగాయని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్నీ పార్టీలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ మాట్లాడుతూ.. ఫొటోలు దిగేందుకే నీతి ఆయోగ్ భేటీ నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also : Congress: విపక్షాల ఐక్యతారాగం.. బీఆర్ఎస్ దూరం.. ఏమిటీ కేసీఆర్ ఆంతర్యం!