Congress: కేంద్రంలో బీజేపీ (BJP Govt) ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ (Congress) చెబుతోంది. ఇందుకు సందర్భంగా కూడా కలిసి వచ్చింది. అదే పార్లమెంటు (New Parliament) కొత్త భవనం ప్రారంభోత్సవం. పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభిచేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. లేదు లేదు.. కొత్త బిల్డింగ్‌ను రాష్ట్రపతి (President) మాత్రమే ఓపెనింగ్ చేయాలంటూ కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఈనెల 28వ తేదీన ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) చేతుల మీదుగా పార్లమెంటు కొత్త భవనం ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
అయితే, విపక్షాలన్నీ ఈ విషయంలో ఏకతాటిపైకి చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభానికి హాజరు కాకూడదని ఇప్పటికే చాలా పార్టీలు నిర్ణయించాయి. దీనిపై రాజకీయ కాక ముదురుతోంది. రాజ్యాంగేతర అధినేతగా ప్రెసిడెంట్ కాకుండా ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించడం… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంటు ఆత్మ లాంటి ప్రజాస్వామ్యానికి ఇది చేటు చేస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త భవనానికి ఎలాంటి విలువా లేదని చెబుతూ… 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాయి.
బహిష్కరణ చేసిన పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే పార్టీలు ఉన్నాయి. అయితే, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు లేకపోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అంతేనా.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్.. (CM KCR) విపక్షాలతో కలిపి తానూ ఒకడిగా అయిపోకుండా ఈ పరిణామంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.
విపక్షాల్లో కలవకుండా చాలా చాకచక్యంగా కేసీఆర్ వ్యవహరించారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. విపక్షాల అందరి టార్గెట్ మోదీ ప్రభుత్వమే. ఇందులో అనుమానం ఏమీ లేదు. అయితే, బలవంతుడైన రాజును ఓడించేందుకు శ్రతుమూకలన్నీ ఏకమయ్యాయన్న రీతిలో.. అందరూ కలిసిపోతే దేశ వ్యాప్తంగా మోదీ బలం ఆటోమేటిగ్గా పెరుగుతుందనేది మరో విశ్లేషణ. ఈ నేపథ్యంలో మోదీ టార్గెట్‌గా తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. రాజకీయం ఎలా చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 19 పార్టీల జాబితాలో చేరకపోవడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది.
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైనా వెళ్తారా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. అధికారికంగా బీఆర్ఎస్ ఇంకా ఈ అంశంపై ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ బీఆర్ఎస్ నేతలు కొంత మంది పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపచేయడం కరెక్ట్ అని చెబుతుండడం గమనార్హం. అయితే ఈ విషయంలో పార్టీ అధికారిక స్టాండ్ ఏమిటనేది క్లారిటీ రావడం లేదు. పార్లమెంటు భవనం వేదికగా ప్రారంభమైన విపక్షాల ఐక్యతా రాగం.. సార్వత్రిక ఎన్నికలకూ పాకుతుందని విశ్లేషణలు వస్తున్నాయి.
బీజేపీని ఓడించడమే లక్ష్యంగా యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. ఈ విషయంలో ఆ పార్టీలతో కలవకపోవడం ఆశ్చరకరమే. గతంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినప్పుడు కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. అనూహ్యంగా ఇప్పుడు వారికి దూరంగా ఉండటం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే, కేసీఆర్ వారికి ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతున్నారా లేకపోతే.. వారే కేసీఆర్ ను కలుపుకునేందుకు ఆసక్తి చూపించడం లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం సంగతి అటుంచితే.. ఇటీవల కేసీఆర్ రాజకీయం చేసే తీరుపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గించేలా ఆర్డినెన్స్ తెచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మద్దతుగా కేసీఆర్ స్పందించలేదు. ప్రస్తుతం పార్లమెంటు భవనం ప్రారంభం విషయంలోనూ స్పందన లేదు. దీంతో జాతీయ రాజకీయాలపై ఎలా ముందుకెళ్తారనేది తెలియాల్సి ఉంది.
Read Also : Haj Yatra: హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. నేరుగా ఏపీ నుంచే యాత్ర..!