గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

RK Roja: రోజా కుమార్తెకు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. ఫొటోలు వైరల్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 20 సెప్టెంబర్ 2025

RK Roja: నటి, మాజీ మంత్రి ఆర్‌.కే. రోజా కూతురు అన్షు మాలిక్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. రచయిత్రిగా పలు పుస్తకాలు రాసి ప్రతిభను చాటుకున్న ఈ స్టార్ కిడ్‌, ఫ్యాషన్ పోటీల్లో కూడా మెరిసింది. ఇప్పుడు అమెరికాలో చదువుకుంటూ తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది.

మౌరీన్‌ బిగ్గర్స్‌ అవార్డు 2025–26
ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్‌లో కంప్యూటర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌ చదువుతున్న అన్షు, తాజాగా ప్రతిష్టాత్మకమైన మౌరీన్‌ బిగ్గర్స్‌ అవార్డు 2025–26ను గెలుచుకుంది. మహిళలు, వెనుకబడిన వర్గాలకు సాంకేతిక విద్యను చేరవేసే కార్యక్రమాలు, వెబ్ డెవలప్‌మెంట్ శిక్షణలు, సోషల్ మీడియా ద్వారా పేదలకు టెక్నాలజీ అవగాహన కల్పించడం వంటి సేవలకు ఈ అవార్డు ఇవ్వబడింది. ఈ అవార్డు ఇండియానా యూనివర్సిటీ ఎక్సెలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రదానం అవుతుంది.

సోషల్ మీడియాలో హల్‌చల్
అవార్డు అందుకున్న విషయాన్ని అన్షు స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. తన గురించి అమెరికా లోకల్ మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు, పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

View this post on Instagram

ఇవీ చదవండి: World tourism day 2023: టూరిజంలో నంబర్‌ వన్‌ అవుదాం.. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి రోజా
Roja fires on Pawan: పవర్ స్టార్ కాదు రీమేక్ స్టార్.. రోజా ఫైర్‌.. జనసైనికులమంటూ మంత్రి టంగ్‌ స్లిప్‌
Minister Roja: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా కుట్ర చేస్తున్నారు.. పవన్‌పై మంత్రి రోజా ఆగ్రహం

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading