గురువారం, 22 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

Mohsin Naqvi : పాకిస్తాన్ ప్రధాని పేరే తప్పుగా రాసిన PCB చీఫ్ మొహ్సిన్ నఖ్వీ… సోషల్ మీడియాలో ట్రోల్స్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 27 జనవరి 2026

Mohsin Naqvi : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పేరు వివాదాలకు కొత్తేమీ కాదు. ప్రపంచకప్, ఆసియా కప్ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్ల వేళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బహిష్కరణ హెచ్చరికలు, రాజకీయ ప్రకటనలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందు మరోసారి వివాదానికి కారణమయ్యాడు. ఈసారి ఆయన చేసిన పొరపాటు తీవ్ర విమర్శలకు దారి తీసింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి పేరును తప్పుగా రాసి… సోషల్ మీడియాలో అబాసుపాలయ్యాడు.

ప్రపంచకప్ డ్రామా మధ్యలో కొత్త వివాదం
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై ఇటీవల పీసీబీ చైర్మన్ నఖ్వీ కొత్త డ్రామాకు తెరలేపిన విషయం తెలిసిందే. టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామంటూ సంకేతాలు ఇస్తూ పరిస్థితిని ఉద్రిక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 26, సోమవారం నఖ్వీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ను కలిశాడు. ఈ భేటీలో టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించిన అంశాలు, జట్టు ఎంపికలు, భద్రతా అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.

పోస్ట్ ఒక్కటే… పరువు పోయింది
ప్రధానితో భేటీ అనంతరం మొహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) లో ఈ సమావేశం గురించి ఓ పోస్ట్ చేశాడు. అయితే అదే పోస్ట్ అతడిని నవ్వుల పాలయ్యేలా చేసింది.
ప్రధాని షాబాజ్ షరీఫ్ పేరును పేర్కొనాల్సిన చోట…
👉 “మియాన్ ముహమ్మద్ నవాజ్ షరీఫ్” అని రాశాడు.

నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధాని కాగా, ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆయన సోదరుడు. అయినప్పటికీ, దేశ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా ఉండి ప్రధాని పేరునే తప్పుగా రాయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

నెట్టింట ట్రోల్స్… వెంటనే ఎడిట్

ఈ పొరపాటు గమనించిన నెటిజన్లు వెంటనే ట్రోల్స్ మొదలుపెట్టారు.
“ప్రధాని ఎవరో కూడా తెలియదా?”
“క్రికెట్ బోర్డు చైర్మన్ కంటే సోషల్ మీడియా మేనేజర్ బెటర్”
అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

విషయం ముదిరుతుందని గ్రహించిన నఖ్వీ కొద్దిసేపటికే తన పోస్ట్‌ను ఎడిట్ చేసి షాబాజ్ షరీఫ్ పేరును సరిచేశాడు. కానీ అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో నష్టం జరిగిపోయింది.

టీ20 వరల్డ్ కప్‌పై ఇంకా స్పష్టత లేదు
ఈ సమావేశం అనంతరం నఖ్వీ మాట్లాడుతూ… టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి తుది నిర్ణయం జనవరి 30 (శుక్రవారం) లేదా ఫిబ్రవరి 2 (సోమవారం) తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొనాలా వద్దా అన్న నిర్ణయం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే క్రికెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం — పాకిస్తాన్ కావాలనే ఈ అంశాన్ని లాగుతూ, అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

వివాదాలకే చిరునామాగా PCB చీఫ్
ప్రపంచకప్ బహిష్కరణ హెచ్చరికలు, ఐసీసీపై విమర్శలు, రాజకీయ వ్యాఖ్యలు… ఇప్పుడు ప్రధాని పేరు తప్పుగా రాయడం —
ఇలా మొహ్సిన్ నఖ్వీ పేరు మరోసారి పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రతికూల ప్రచారాన్ని తెచ్చిపెట్టింది.

టీ20 ప్రపంచ కప్‌పై స్పష్టత వచ్చేలోపు… ఈ వివాదం పాకిస్తాన్ క్రికెట్ పరువును మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది.

ఇవీ చదవండి: Viral Video : ఇవే.. తగ్గించుకుంటే మంచిది.. బౌలర్‌ను వెక్కిరించబోయి వికెట్ సమర్పించుకున్న పాక్ బ్యాటర్
ICC on Pakistan : పాకిస్తాన్ తీరుపై ఐసీసీ యాక్షన్ ప్లాన్.. ఏకాకిని చేసే దిశగా కఠిన వ్యూహం?

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading