Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లలో గత ప్రభుత్వానికి, జగన్‌ ప్రభుత్వానికి తేడా ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ప్రస్తుతం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై రాజకీయం నడుస్తోంది. ఏపీలో (Andhra Pradesh) ప్రభుత్వం ధాన్యంకొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అయితే, ప్రతిపక్షాలుమాత్రం గగ్గోలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వంలో (Andhra Pradesh) ఈ-క్రాప్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా రైతు ఎంత విస్తీర్ణంలో పంట వేశాడనే విషయాన్ని గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది నమోదు చేస్తున్నారు.

ఈ డేటా ఆధారంగా పంట బీమా , ఇన్ పుట్ సబ్సిడీ , పంట నష్టపరిహారం చెల్లింపులతోపాటు ధాన్యం కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. ఇలా చేయడం దేశంలోనే తొలిసారి. దీని వల్ల ఎలాంటి అవకతవకలకూ చోటు లేకుండా ఈ ప్రక్రియ జరుగుతోంది. పంట వేసిన దగ్గర నుంచే ఇ-క్రాప్ డేటా నమోదుచేసి ఫిజికల్, డిజిటల్ రసీదులు రైతులకు ఇస్తున్నారు. దీంతో రైతులకు సంబంధించిన అన్ని వివరాలూ వ్యవసాయశాఖకు చేరుతున్నాయి. అందువల్ల బీమా సొమ్ము, ఇన్ పుట్ సబ్సిడీ, పంట కొనుగోలు డబ్బులు మూడోవ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా రైతు ఖాతాకే వెళ్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి విధానం లేదు.

1. ఇ-క్రాప్ ప్రొక్యూర్మెంట్, ఆర్ బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తుండడంతో ఇప్పుడు ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులు కనీస మద్దతు ధర పొందగలుగుతున్నారు. గతంలో ప్రభుత్వంలో ఈ అవకాశం లేదు. 2014-2015, 2015-2016 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు వివరాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

2. గతంలో ధాన్యం కొనుగోలు జరిపేముదు ఎఫ్ఏక్యూ విశ్లేషణకోసం రైతులే తాపత్రయపడాల్సి వచ్చేది. నిర్ధారణలో రైతులకు మోసాలు జరిగేవి. సరైన యంత్రాలు కూడా ఉండేవి కావు. ఈ ప్రభుత్వం వచ్చాక వాటికి చెక్ పడింది. నేరుగా రైతు దగ్గరకే టెక్నికల్ అసిస్టెంట్స్ వచ్చి ధాన్యం శాంపిళ్లు తీసుకుంటున్నారు. రైతు ఎదురుగానే దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని వారికి రసీదు కూడా ఇస్తున్నారు.

3. గతంలో ధాన్యం కొనుగోలులో శాఖల మధ్య సమన్వయలోపం ఉండేది. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందులు వచ్ఛేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఇబ్బంది లేదు. రైతులతో రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మధ్య నిత్యం సమన్వయం ఉంటోంది. ధాన్యం కొనుగోలు సజావుగా సాగడానికి ఇది ఉపయోగపడుతోంది.

4. గతంలో ధాన్యం కొనుగోలు కేవలం సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవి కూడా అరకొరగానే ఉండేవి. ప్రస్తుతం ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు జరుగుతోంది.

5. గతంలో రైతులకు గోనె సంచులు ఇచ్చే పనిని మిల్లర్లకు వదిలేసేశారు. దాంతో సరిపడా సంచులు దొరక్క రైతులు ఇబ్బంది పడేవాళ్లు. ీ ప్రభుత్వం వచ్చాక గోనెసంచుల బాధ్యతను ఏపీఎస్సీఎస్సీఎల్, పీఏసీఎస్ లు తీసుకొని, సమర్థంగా ఆ పనిని చేస్తున్నాయి.

6. గతంలో కేవలం ఎ-గ్రేడ్, సాధారణ రకం అనే రెండు రకాలుగానే కొనుగోలు చేసేవాళ్లు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవాళ్లు. కానీ, ఈ ప్రభుత్వం ధాన్యం వెరైటీల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్పీ ఇచ్చి కొనుగోలు చేస్తూ రైతులకు లాభం కలిగిస్తోంది.

7. గతంలో ధాన్యం కొనుగోలు మిల్లర్ల చేతుల్లో ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక మిల్లర్లకు ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే కొంటోంది.

8. గతంలో రైతులు మిల్లుల వద్దకు వెళ్లి అక్కడే ధాన్యం కొలమానాల ప్రక్రియ చేయాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల వద్దనే తూకం సహా అన్నిరకాల కొలమానాలు పూర్తి చేసి, అన్ని వివరాలతో రసీదు ఇస్తున్నారు. ఫిర్యాదులుంటే రీసీదు వెనక టోల్ ఫ్రీ నెంబరు కూడా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రైతులు నేరుగా కాల్ చేసి ప్రభుత్వం నుంచి సహాయం పొందొచ్చు.

9. గతంలో సేకరించిన ధాన్యం రవాణా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. ఏపీఎస్సీఎస్సీఎల్ కొన్ని ఏజెన్సీలు, రవాణాదారులను నియమించింది. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ధాన్యం రవాణా జరుగుతోంది.

10. గతంలో రైతులకు జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా ) ఖర్చులు అందేవి కావు. కానీ, ఇప్పుడు ఈ ఖర్చులను ప్రభుత్వం రైతులకు అందిస్తూ తోడోగా నిలుస్తోంది.

11. గతంలో ధాన్యం కొనుగోలు డబ్బులు సకాలంలో వచ్చేవి కావు. ఈ ప్రభుత్వం వచ్చేనాటికే రూ.960 కోట్లను బకాయిలుగా పెట్టారు. వాటిని తీర్చడమే కాక, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతులకు చెల్లింలపులు చేస్తోంది.

12. గతంలో ఈ వ్యవస్థలు లేనందువల్ల మధ్యవర్తులు / మిల్లర్లు రైతాంగం దగ్గర ధాన్యం తక్కువ ధరకు కొని, అదే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మి కనీస మద్దతు ధరతోపాటు రైతుకు చెందాల్సిన రవాణా, గన్నీ, హమాలీ చార్జీలను కూడా తమ ఖాతాల్లోకి వేసుకునేవారు. ఇప్పుడు అలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టింది ఈ ప్రభుత్వం.

ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలివీ..

* ఖరీఫ్ 2022-23కు సంబంధించి ధాన్యం సేకరణ పూర్తయ్యింది.
* 6 లక్షల 40 వేల 889 మంది రైతుల నుంచి 35.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
* 6 లక్షల 39 వేల 303 మంది రైతుల ఖాతాల్లో రూ.7,212.81 కోట్ల (దాదాపు 99 శాతం) చెల్లింపు పూర్తయ్యింది.

2022-23 రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ఇలా.. (11-05-2023 నాటికి)

* పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణా, బాపట్ల, ఎస్పీఎస్సార్ నెల్లూరు, ప్రకాశం, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, అనకాపల్లి, అన్నమయ్య జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేశారు.
* ఆయా జిల్లాల్లో మొత్తం 7,98,245 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 87,263 మంది రైతుల నుంచి కొనేందుకు ప్రభుత్వం రూ.1,629.35 కోట్లు వెచ్చిస్తోంది.
* ఇప్పటి వరకు 78,882 మంది రైతులకు రూ.1277.06 కోట్లు చెల్లించారు. దాదాపు 79 శాతం చెల్లింపు పూర్తయ్యింది. ఇంకా 21.14 శాతం చెల్లించాల్సి ఉంది.

గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా..

* 2014-2019 మధ్య రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించి గత ప్రభుత్వం 2,65,10,747 మెట్రిక్ టన్నుల ధాన్యం కొని 17,94,279 మంది రైతులకు రూ.40,236.91 కోట్లు ఇచ్చింది.
* ప్రస్తుత ప్రభుత్వం 2018-19 బకాయిలతో పాటు ఇప్పటి వరకు 3,04,60,303 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 32,07,894 మంది రైతులకు రూ.57,522.65 కోట్లు అందజేసింది.

Read Also : YS Jagan: జగనన్నకు చెబుదాం ప్రారంభం.. ముఖ్యమంత్రి ఫుల్‌ స్పీచ్‌ ఇదే..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles