సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Globe Trotter : మహేష్–రాజమౌళి సినిమాలో మరో ట్విస్ట్… ఆ స్టార్ హీరో కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 14 నవంబర్ 2025

Globe Trotter : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి తాజా యాక్షన్–అడ్వెంచర్ చిత్రం చుట్టూ రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమౌతున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్ వేగంగా జరుగుతున్న నేపధ్యంలో, ప్రతి అప్‌డేట్‌పై ప్రేక్షకులు, ముఖ్యంగా మహేష్ అభిమానులు, వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మహೇಶ್ బాబు కొత్తగా, చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ పాన్-వరల్డ్ అడ్వెంచర్ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అదనంగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ లుక్‌ను విడుదల చేయగా, తాజాగా ప్రియాంక చీరకట్టులో కనిపించిన స్టన్నింగ్ లుక్‌ను కూడా విడుదల చేసి హైప్‌ను మరింతగా పెంచారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను రాజమౌళి ప్రత్యేకంగా #GlobeTrotter అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌ను నవంబర్ 15న భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ప్రియాంక చోప్రా లుక్‌పై పాన్–ఇండియా స్టార్ ఆర్. మాధవన్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. “వావ్… బ్రిలియంట్! వాట్ ఎ లుక్. రోజురోజుకు మీరు నమ్మలేని స్థాయిలో మారిపోతున్నారు” అంటూ మాధవన్ ఆమె లుక్‌ను ప్రశంసించారు. అంతేకాదు, గతంలో విడుదలైన పృథ్వీరాజ్ లుక్‌పై కూడా మాధవన్ స్పందిస్తూ, “ఈ లుక్ అద్భుతం బ్రదర్. ఈ పాత్రలో మిమ్మల్ని చూడడానికి ఇక ఆగలేకపోతున్నాను” అని రాసుకొచ్చారు.

దీంతో ఇప్పుడు మాధవన్ ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారనే రూమర్స్ మరింత బలపడుతున్నాయి. మునుపే మాధవన్ రాజమౌళి సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు వరుసగా మహేష్ బాబు సినిమా అప్డేట్స్‌పై ఆయన రియాక్ట్ అవుతుండడంతో, అభిమానులు “మాధవన్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉన్నారు” అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నిజంగా ఆయన భాగమా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

View this post on Instagram

ఇవీ చదవండి: Mahesh Babu : మహేష్ బాబు జీవితంలో టాప్ 10 విశేషాలు
SSMB 29: మహేష్ బాబు – రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌పై అప్‌డేట్స్

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading