సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Jr NTR: చిన్న మూవీ కోసం రంగంలోకి ఎన్టీఆర్.. హిట్ గ్యారెంటీనా?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 26 డిసెంబర్ 2025

Jr NTR: టాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో పేరు జతకలిస్తే… ఆ సినిమాపై ఒక్కసారిగా లైట్లు ఫోకస్ అవుతాయి. ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మాస్ హీరో నుంచి మద్దతు లభిస్తే, ఆ కథలో ఏదో ప్రత్యేకత ఉందన్న భావన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోతుంది. వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆ స్టార్ హీరో, తాజాగా ఒక చిన్న సినిమాకు తన భుజం అందించారు.

కేవలం స్టార్ సినిమాలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను కూడా ప్రోత్సహించడంలో ముందుండే హీరోగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన విలువైన సమయాన్ని కేటాయించి ఆ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను విడుదల చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సినిమా రంగంలో ఎవరిదైనా సరే… మంచి కథ కనిపిస్తే దానికి అండగా నిలవాల్సిందే అన్న నమ్మకంతో ముందడుగు వేసిన ఈ హీరో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రానికి మద్దతు ప్రకటించారు. ఈ సినిమా వెనుక తనకు అత్యంత సన్నిహితులు ఉండటంతో, వారి అభ్యర్థన మేరకు ప్రమోషన్లలో పాల్గొనడం విశేషంగా మారింది. కొత్త తరాన్ని ప్రోత్సహించడం ఆయనకు మొదటి నుంచీ అలవాటే అన్న విషయం మరోసారి రుజువైంది.

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు… మ్యాన్ ఆఫ్ మాసెస్ Jr NTR!
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమాకు ఎన్టీఆర్ తన మద్దతును అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…
“నా ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ఇప్పటి ‘ఛాంపియన్’ వరకు స్వప్న సినిమా కొత్త గొంతుకలను ప్రోత్సహిస్తూనే ఉంది. వాళ్ల ప్రతి ప్రయత్నంలోనూ సినిమాపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న దత్ నాకు ఎప్పుడూ అండగా ఉంటుంది, నేను కూడా ఆమె టీమ్‌కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాను. రోషన్, అనస్వర రాజన్, ప్రదీప్ అద్వైతంకు ఆల్ ది బెస్ట్. 2025 ముగింపులో ఈ సినిమా ఒక మెమరబుల్ హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘ఛాంపియన్’ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం స్టార్ దర్శకుడు Prashanth Neel దర్శకత్వంలో Dragon అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో Rukmini Vasanth హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి: War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. హృతిక్, ఎన్టీఆర్ యాక్షన్ అదిరిందా?
War 2 : వార్ 2 షూటింగ్ కంప్లీట్.. జూనియర్ ఎన్టీఆర్ కీలక పార్ట్ మాత్రమే!

ట్యాగ్స్: , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading