Singapore new president: సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా షణ్ముగరత్నం

Singapore new president: సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నికయ్యారు. 70.4 శాతం ఓట్లతో సింగపూర్ అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక కావడం విశేషం. సింగపూర్ మాజీ ఉపప్రధానిగా పని చేశారు షణ్ముగరత్నం. భారత సంతతి మూలాలు ఉన్న షణ్ముగరత్నం.. సింగపూర్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన వర్గీయులు, ఆ దేశ పౌరులు సంబరాలు చేసుకుంటున్నారు. (Singapore new president)

రిటర్నింగ్‌ అధికారి ప్రకటించిన ఈ ఫలితాలతో సింగపూర్‌కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక అయ్యారు. ఖరారైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ ఆయనను అభినందించారు. ప్రధాని లీ సారథ్యంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నంకు అండగా నిలిచింది. గతంలో భారతీయ సంతతికి చెందిన ఎస్‌.రామనాథన్‌, దేవన్‌ నాయర్‌ సింగపూర్‌ అధ్యక్షులుగా పనిచేశారు.

సింగపూర్‌కు 9వ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్‌ షణ్ముగరత్నం 2011 నుంచి 2019 దాకా సింగపూర్‌ ఉప ప్రధానిగా సేవలందించారు. 2019 – 2023 మధ్యకాలంలో సీనియర్‌ మంత్రిగా కేబినెట్‌లో విధులు నిర్వహించారు. ప్రముఖ ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరున్న షణ్ముగరత్నం సింగపూర్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957లో పుట్టారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందారు.

తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ.. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశారు. విద్యార్థిదశలో క్రీడల్లో చురుగ్గా ఉండేవారు. ‘‘ఫాదర్‌ ఆఫ్‌ పాథాలజీ ఇన్‌ సింగపూర్‌’’గా పేరున్న వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కె.షణ్ముగరత్నం కుమారుడే థర్మన్‌ షణ్ముగరత్నం. స్థానిక న్యాయవాది జేన్‌ యుమికో ఇట్టోగిని ఆయన పెళ్లాడారు.

ఇదీ చదవండి: Viveka murder case: వివేకా హత్య కేసులో ఏ2 సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles