IND vs NZ: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం క్రికెట్ అభిమానులకు కనుల పండువైన మ్యాచ్‌ను అందించింది. భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా సంచలన విజయంతో మరోసారి తన సత్తాను చాటింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే చేజ్ చేసి టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్ 200+ రన్ చేజ్‌గా ఈ మ్యాచ్ నిలిచిపోయింది.
అయితే ఈ విజయానికి ఆరంభం మాత్రం ఆశించినట్టుగా లేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా, సంజూ శామ్సన్ కూడా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. కేవలం 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది.
ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పారు. కివీస్ బౌలర్లపై ఎలాంటి గౌరవం లేకుండా దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించారు. ఈ జోడీ కేవలం 8 ఓవర్లలోనే స్కోరును 100 దాటించడంతో స్టేడియం మొత్తం హోరెత్తింది.
ముఖ్యంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్‌మార్క్ 360 డిగ్రీ షాట్లతో మళ్లీ పాత ఫామ్‌ను గుర్తు చేశాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్య, చివరి వరకు అజేయంగా నిలబడి 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు.
ఇషాన్ అవుట్ అయిన తర్వాత శివమ్ దూబే సూర్యకు అద్భుతంగా సహకరించాడు. దూబే 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 27 బంతుల్లో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, రచిన్ రవీంద్ర 44 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టి కాస్త నియంత్రణ చూపించాడు.
ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ముఖ్యంగా రాయ్‌పూర్‌లో టీమిండియా ఆడిన 100వ హోమ్ టీ20 మ్యాచ్‌లో ఇలాంటి అద్భుత విజయం సాధించడం అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. ఒత్తిడిలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ చూపిన ఆత్మవిశ్వాసం 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు భారీ బూస్ట్‌గా నిలిచింది.
ఇక మూడో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్‌ను ముందుగానే కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: T20 World Cup 2026: బంగ్లాదేశ్ ఔట్? మ్యాచ్‌ల వేదిక మార్పుపై జై షా ముందడుగు! టీ20 వరల్డ్ కప్
INDW vs SLW 2nd T20I: షెఫాలీ తుఫాన్ హాఫ్ సెంచరీ… రెండో టీ20లోనూ టీమ్ ఇండియాదే ఘన విజయం






