VinFast VF8: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అయితే ఈసారి కారణం రాజకీయాలు కాదు.. ఆయన చేతిలో కనిపించిన చిన్న ఎలక్ట్రిక్ కారు మోడల్. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ VinFast ఆసియా విభాగం సీఈఓ ఫామ్ సాన్ చౌ ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కంపెనీకి చెందిన VF8 ఎలక్ట్రిక్ SUV స్కేల్ మోడల్‌ను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా విజయ్ ఆ చిన్న కారును ఆసక్తిగా చేతిలో పట్టుకుని పరిశీలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన చిన్నపిల్లాడిలా ఆ కారును తిప్పి చూస్తూ చిరునవ్వుతో స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.
వైరల్ అయిన వీడియోలో ఏముంది?
సాధారణంగా ప్రముఖులకు జ్ఞాపికలు అందించడం కొత్త విషయం కాదు. కానీ ఈ వీడియోలో ముఖ్యమంత్రి విజయ్… బహుమతిని చిరునవ్వుతో స్వీకరించడం, కారును అన్ని వైపులా ఆసక్తిగా పరిశీలించడం, చిన్న మోడల్‌ను జాగ్రత్తగా చేతిలో తిప్పి చూడడం నెటిజన్లను ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో…
“పిల్లాడిలా ఎంజాయ్ చేశారు””చాలా సింపుల్ పర్సనాలిటీ””ఇంత పెద్ద సీఎం అయినా చిన్న విషయాల్లో ఆనందపడుతున్నారు.. అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
అది బొమ్మ కారు కాదు!
చాలామంది సోషల్ మీడియాలో దీనిని “టాయ్ కార్”గా పేర్కొంటున్నప్పటికీ… అది నిజానికి VinFast VF8 Electric SUVకు చెందిన స్కేల్ డిస్‌ప్లే మోడల్. ఇలాంటి మోడళ్లను… కంపెనీ ఎగ్జిబిషన్లలో, కార్పొరేట్ గిఫ్ట్‌లుగా, బ్రాండ్ మెమెంటోగా ప్రత్యేకంగా తయారు చేస్తుంది.
VinFast VF8 అంటే ఏమిటి?
VinFast VF8 ఒక ప్రీమియం మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే విక్రయాలు జరుగుతున్న ఈ కారు… ఆధునిక డిజైన్, లగ్జరీ క్యాబిన్, పొడవైన డ్రైవింగ్ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో గుర్తింపు పొందింది.
కొత్త VF8లో ఏమున్నాయి?
తాజా అప్‌డేటెడ్ వెర్షన్‌లో…బ్యాటరీ, 60.13 kWh బ్యాటరీ ప్యాక్, మోటార్, 228 hp పవర్, 330 Nm టార్క్, రేంజ్, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 500 కి.మీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
ఫాస్ట్ ఛార్జింగ్
DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో… 10% నుంచి 70% వరకు 30 నిమిషాల లోపే ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది.
గమనిక: వాస్తవ రేంజ్ డ్రైవింగ్ పరిస్థితులు, వేగం, వాతావరణాన్ని బట్టి మారవచ్చు.
పాత మోడల్ ప్రత్యేకత ఏమిటి?
VinFast VF8 పాత వెర్షన్‌లో…
87.7 kWh బ్యాటరీ
FWD, AWD రెండు వేరియంట్లు అందుబాటులో ఉండేవి.
ముఖ్యంగా… FWD వేరియంట్ ఒక్కసారి ఛార్జ్‌తో సుమారు 562 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని అందించేది. కొత్త వెర్షన్‌లో బ్యాటరీ పరిమాణం తగ్గించినప్పటికీ, సామర్థ్యం, సమర్థవంతమైన పనితీరుపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
భారత్‌లో VinFast భారీ ప్లాన్
వియత్నాంకు చెందిన VinFast ఇప్పటికే భారత మార్కెట్‌పై దృష్టి పెట్టింది. కంపెనీ… భారత EV మార్కెట్లో ప్రవేశించింది.
కొన్ని ఎలక్ట్రిక్ కార్లను ప్రకటించింది. తమిళనాడులో అత్యాధునిక తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా… దేశీయ మార్కెట్ ఎగుమతులు రెండింటినీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ – VinFast భేటీ ఎందుకు కీలకం?
ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. తమిళనాడులో… కొత్త పెట్టుబడులు, EV తయారీ, ఉద్యోగాల కల్పన
పారిశ్రామిక అభివృద్ధి, వంటి అంశాల దృష్ట్యా కూడా ఈ భేటీకి ప్రాధాన్యత ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్
చిన్న మోడల్ కారును చూసి విజయ్ వ్యక్తం చేసిన ఆనందం ప్రస్తుతం X, Instagram, Facebookలో వైరల్‌గా మారింది. రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ వ్యక్తిలా ఆయన స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇవీ చదవండి: Viral News: రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్ కొనేసిన వ్యక్తి.. నల్లగొండలో వైరల్‌గా మారిన పొదుపు కథ!
MS Dhoni, C Joseph Vijay: థలా ధోనికి బర్త్ డే విషెస్ చెప్పిన దళపతి సీఎం విజయ్






