యువ హీరోయిన్, ఢిల్లీ పిల్ల కేతిక శర్మ (Ketika Sharma) కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. అందాల ఆరబోతతో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ సరసన రొమాంటిక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. (Ketika Sharma) నటనలో మంచి మార్కులు కొట్టేసింది. మొదటి సినిమాలోనే హాట్ అందాలతో రెచ్చిపోయిన కేతిక శర్మకు.. అవకాశాలు అడపాదడపాగానే వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
రొమాంటిక్ మూవీతో కాస్త రొమాంటిక్ గానే నటించిన ఈ ముద్దుగుమ్మ.. అందాలతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. టాలీవుడ్ సర్కిల్స్ లో, ప్రేక్షకుల్లోనూ కేతిక శర్మ పేరు మార్మోగింది. మొన్నామధ్య కేతిక శర్మ రంగరంగ వైభవంగా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ సరసన ఆడి పాడింది. ఈ చిత్రంలో మరోసారి అందాలతో విందు చేసింది. తమిళంలో హిట్ సాధించిన వినోదయ సీతం మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనను ప్రమోట్ చేసుకొనేందుకు ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో ఫొటో షూట్లు చేస్తూ అందాలతో కనువిందు చేస్తోంది.
తన గ్లామర్ టచ్ తో కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో అవకాశాలు మెరుగుపడేందుకు, గ్లామర్ గాళ్ గా పేరు తెచ్చుకొనేందుకు కాస్త గ్లామర్ డోసు పెంచుతోంది.
రంగరంగ వైభవంగ మూవీలో హైప్ క్రియేట్ చేయడానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మరో హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ రోల్ చేస్తారనే టాక్ నడిచింది. దీంతో అంచనాలు పెరిగాయి.
మరోవైపు కేతిక శర్మ నెట్టింట అందాల ఆరబోత కూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా ఫొటో సెషన్ లో రెడ్ డ్రస్ లో కేతిక శర్మ కనువిందు చేసింది. రొమాంటిక్ పోజులతో మతి పోగొట్టేలా చేస్తోంది. ఈ ఫొటోలను నెటిజన్లు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
Teja: ఉదయ్ కిరణ్ నా కాళ్లు పట్టుకుంటానన్నాడు.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు..
టాలీవుడ్ లో విజయవంతమైన డైరెక్టర్ గా తేజ రాణించాడు. ఒకప్పుడు మంచి సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో చాలా మందిని హీరోలుగా చేశాడు. యువ హీరోలకు బెస్ట్ కెరీర్ అందించాడు కూడా. అలాంటి హీరోల్లో దివంగత ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం మూవీలో ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించాడు. ఆ మూవీతో డైరెక్టర్ కు, హీరోకు మంచి పేరొచ్చింది.
అయితే, మొదట ఈ చిత్రానికి హీరోగా మరో కథానాయకుడిని అనుకున్నారట. కానీ చివరకు ఉదయ్ కిరణ్ కన్ఫం అయ్యాడట. అనంతరం తేజ, ఉదయ్ కిరణ్ కాంబోలో నువ్వు నేను అనే మూవీ వచ్చింది. ఆ తర్వాతే హీరోగా ఉదయ్ కిరణ్ ఫామ్ లోకి వచ్చాడు. వరుస ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. అనతి కాలంలోనే యువ హీరోగా, పాపులర్ అయ్యాడు ఉదయ్ కిరణ్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ, తన దర్శకత్వంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను సినిమాల ద్వారా ఉదయ్ కిరణ్ కు స్టార్ డమ్ పెరిగిందన్నాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కు చాలా సార్లు మాట్లాడాలని ప్రయత్నించినా తను రెస్పాండ్ కాలేదన్నాడు. ఔనన్నా కాదన్న మూవీ చేస్తున్న సమయంలో ఓ రోజు ఉదయ్ కిరణ్ తన వద్దకు వచ్చి తప్పు చేశాను… మీరు పిలిచినా రెస్పాండ్ కాలేదు.. అంటూ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడని తేజ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తేజ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు కొన్ని హిట్లు సాధించాక డిజాస్టర్ మూవీలు కూడా మొదలయ్యాయి ఉదయ్ కిరణ్ కు. అనంతరం నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమా చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ నటించిన ఔనన్నా కాదన్నా మూవీ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి డైరెక్టర్ తేజ ఇటీవల వెల్లడించారు.
Read Also : Meera Jasmine: నాలుగు పదుల వయసులోనూ సీనియర్ హీరోయిన్ క్రేజ్