సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ (Meera Jasmine) టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి. తెలుగులో రవితేజ సరసన భద్ర సినిమాలో నటించిన మీరా జాస్మిన్ (Meera Jasmine) మంచి మార్కులు కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ మూవీలో సైతం హీరోయిన్ గా మీరా జాస్మిన్ నటించింది. అయితే, సంప్రదాయబద్ధమైన డ్రస్సులతో సినిమాల్లో కనిపించింది. ఏనాడూ హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయలేదు. ఫీల్ గుడ్ ఇంప్రెషన్ కల్పించింది.
కానీ ఇప్పుడు నాలుగు పదుల వయసులో కాస్త ఘాటు అందాలతో రెచ్చిపోతోంది ఈ సీనియర్ హీరోయిన్. సోషల్ మీడియా వేదికగా హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరోయిన్లకు దీటుగా తానేమీ తీసిపోలేదంటూ అందాల ఆరబోత షురూ చేసింది మీరా జాస్మిన్. సినిమాల్లో మానేశాక ఇప్పుడు ఈ ఎక్స్ పోజింగ్ ఎంటి దేవుడా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మీరా జాస్మిన్ ఫొటోలతో చాలా మంది స్టన్ అవుతున్నారు.
వివాహం తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చిన మీరా జాస్మిన్.. పిల్లలు, సంసార బాధ్యతల్లో తలమునకలైంది. అయితే తాజాగా మీరా మలయాళంలో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే, తెలుగు- తమిళ పరిశ్రమలకు కాస్త దూరంగా ఉంటోంది. ఇకపై అన్ని పరిశ్రమల్లోను అవకాశాల్ని కోరుకుంటోందనే సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారు. ఈ ఫొటో సెషన్ లలో అందుకే ఇలా హద్దులు చెరిపేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇటీవల కాలంలో మీరా జాస్మిన్ తన అందాలను ఏ మాత్రం దాచుకోకుండా చూపిస్తోంది. బొద్దు తనం కాస్త తగ్గించి హాట్ గా రూపాంతరం చెందింది. ఇటీవల ఫొటో షూట్ లతో ఈ భామ కనువిందు చేస్తోంది. ఫ్లోరల్ డిజైన్ ప్రాక్ లో ఎద అందాలు ఆరబోసింది. తెలుగు చిత్ర సీమలో రీ ఎంట్రీ కోసమేనంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.
Prakash Raj: ఇండస్ట్రీలో మాఫియా అంటూ ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు
తండ్రి పాత్రలు, విలన్ క్యారెక్టర్ లు విరివిగా చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఏ విషయాన్నయినా ముక్కుసూటిగా చెబుతారనే పేరుంది. ఇతడు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో ప్రశ్నలు కురిపిస్తూనే ఉంటారు. మన్నామధ్య తాను నటించిన ముక్బీర్ అనే చిత్రానికి సంబంధించి ప్రమోషన్లలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాకపోతే కొందరు త్యాగధనులు తెరమరుగున పడ్డారని, అలాంటి వారి గురించి ఈ సినిమాలో చూపిస్తామని చెప్పారు ప్రకాశ్ రాజ్. మన భారత దేశాన్ని చాలా సంఘటనలు, అనేక విషయాలు ముందుకు నడిపిస్తున్నాయన్న ప్రకాశ్ రాజ్.. ఒకరి ఐడియాలజీ, ఓ పార్టీ, ఓ నేత దేశానికి స్పూర్తినిస్తారని వ్యాఖ్యానించారు.
ముక్బీర్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది. ప్రముఖ ఓటీటీ యాప్ జీ5లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించారు. 1960ల నుంచి ఇప్పటి వరకు జరిగిన కొన్ని తెరమరుగు ఘటనల గురించి ఈ చిత్రంలో చూస్తారంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన త్యాగధనుల వల్లే తాను ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నానని ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు.
దేశ భక్తి అనేది కొందరికే సొంతం కాదని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. దేశంలో బతుకుతున్న ప్రతి ఒక్కరూ దేశ భక్తులేనని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. మన దేశానికి ప్రతి ఒక్కరూ ఎన్నో సేవలు చేస్తున్నారని తెలిపారు. దేశానికి సేవ చేస్తున్న వారి గురించి మనం ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యక్త ఎంతైనా ఉందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. సినిమా రంగం గురించి మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలో మాఫియా అనే పదం క్రేజీగా వినిపిస్తుందన్నారు.
మాఫియా ఆధారంగా సినిమాలు వస్తుంటాయన్నారు. థియేటర్లలోనే ముందుగా రిలీజ్ చేయాలనే నిబంధన ఉండేదని, కరోనా నేపథ్యంలో అలాంటి మాఫియాకు ఎదురు దెబ్బ తగిలిందంటూ ప్రకాష్ రాశ్ కామెంట్ చేశారు. ఓటీటీలో తమకు నచ్చిన కంటెంట్ ను ప్రేక్షకులు చూసుకుంటున్నారని తెలిపారు.
Read Also : Vastu Shastra: స్థలానికి కూడా వాస్తు చూడాలా? నిపుణులు ఏమంటున్నారంటే..