ఇల్లు కట్టుకోవాలంటే మొదట స్థలం చూడాలి. మంచి ఏరియాలో, నివాసానికి యోగ్యమైన స్థలం చూసుకోవాలి. అయితే, చాలా మంది ఇంటి స్థలం ఎలా ఉండాలో జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇల్లు కట్టుకోవడానికి ఎలాగైతే వాస్తు నియమాలు పాటిస్తారో, ఇంటి స్థలానికి కూడా వాస్తును (Vastu Shastra) చాలా మంది చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి స్థలం కొనాలి? కొన్న స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలంటే ఎలాంటి వాస్తు (Vastu Shastra) పద్ధతులు పాటించాలో వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.
ఓ మనిషి ఆరోగ్య పరిస్థితి అతని ముఖంలో కనిపించినట్లుగానే ఓ స్థల వాస్తు వైభవం ఆ స్థలం మట్టిలో కనిపిస్తుందని వాస్తు పండితులు అంటున్నారు. స్థలంలో పెరిగిన చెట్లు, వాతావరణం అక్కడ ప్రత్యక్షమవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా స్థలం అనువుగా ఉందో లేదో కొనుగోలు దారులు నిర్ణయించుకుంటారు. నివాసయోగ్యం, స్థలం బడ్జెట్, ఇల్లు నిర్మించుకోవడానికి బడ్జెట్ తదితరాలన్నీ చూసుకున్నాకే ఆ స్థలం కొనుగోలు చేయడానికి ముందుకెళ్తుంటారు.
ఒక ఇంటిని నిర్మించుకోవడంలో చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. స్థలం ఎంపిక మొదలుకొని.. ఇంటిని ప్లాన్ ప్రకారం కట్టుకోవడం, బిల్డర్ కు సూచనలు, సలహాలు ఇవ్వడం, వాస్తు ప్రకారం అన్ని గదులు, బెడ్రూమ్, వంట గది, హాలు, ఇలా ఏది ఎక్కడుండాలో వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు. కాస్త డబ్బు ఖర్చు ఎక్కువైనా సరే.. కొందరు పట్టింపులకు పోకుండా వాస్తును ఫాలో అవుతుంటారు.
కొనుగోలు చేయాలనుకున్న స్థలం వాస్తు విషయంలో ఆ స్థలం దిశాత్మకంగా ఉండాలని సూచిస్తున్నారు. వంకరగా, త్రిభుజాకారంలో ఉండే స్థలాలు, ఇరుకు సందుల మధ్య ఉండేవి అంత శ్రేయస్కరం కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. వీధులు నేరుగా, వరుసగా వెళ్లలేని కూడలి స్థలాలు కూడా మంచివి కావట. అలాంటి స్థలాలు హానికర లక్షణాలను కలిగి ఉంటాయట. మనుషుల్లో చాలా మందిలో వేర్వేరు స్వభావాలుఉన్నట్లే స్థలాల్లోనూ అంతేనని చెబుతున్నారు. ఇంటి స్థలాలను ఎంచుకొనే క్రమంలో పగటి పూట పరిశీలించాలట. కాస్త వాస్తు పరిజ్ఞానం తెలిసిన వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
Vastu Tips: ఇంట్లో లాకర్ ను డబ్బుతో నింపాలా? మంచి రోజు ఏదంటే..
ప్రతి ఇంట్లో డబ్బు దాచుకొనేందుకు ఓ లాకర్ ఉంటుంది. అయితే, దీన్ని వాస్తు ప్రకారం ఉండాల్సిన దిశలో ఉంచితేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. లాకర్ ను సరైన దిశ, స్థానంలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం అల్మారా లేదా లాకర్ ఎక్కడ ఉంచుకోవాలనేది వాస్తు శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పారు.
లాకర్ నిర్మాణం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ తిథులు అత్యుత్తమంగా భావించవచ్చని సూచిస్తున్నారు. లాకర్ నిర్మించే సమయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. చెక్క అల్మారా సన్నగా లేదా వెడల్పుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో తిండి, డబ్బు కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఒకే వెడల్పుతో కూడిన గదిని ఉంచుకోవాలని చెబుతున్నారు. ఏటవాలుగా ఉన్న అల్మారాలో డబ్బు నిలబడదట.
అల్మారాలు, లాకర్ నిర్మించుకోవడానికి సైతం కొన్ని సమయాలను మంచివిగా పేర్కొంటున్నారు. స్వాతి, శ్రవణం, పునర్వసు, ఉత్తర, ధనిష్ట నక్షత్రాలు అల్మారా, లాకర్ నిర్మించుకొనేందుకు అనుకూలమైనవిగా వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే, శుక్రవారం రోజున కూడా లాకర్, అల్మారాల నిర్మాణానికి మంచిదిగా చెబుతున్నారు. ఈ తిథులకు, ముహూర్తాలకు చాలా ప్రాశస్త్యం ఉందని పండితులు పేర్కొంటున్నారు.
లాకర్, అల్మారా తూర్పు లేదా, ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. సక్రమమైన పద్ధతిలో పూజ చేశాకే వస్తువులను అందులో ఉంచాలని సూచిస్తున్నారు. పండుగలు, శుభ సందర్భాలు, వేడుకల సమయంలో ఇష్టదైవాన్ని పూజించినట్లే లాకర్ ను కూడా పూజించాలి. దీని వల్ల ఆ ఇంటికి ఆశీర్వాదం లభిస్తుందట. అలాగే లాకర్ ఉన్ గదిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఆ గదిలో బట్టలు మురికిగా, అపరిశుభ్రంగా ఉంచుకోరాదు.
Read Also : Coconut Oil Benefits: కొబ్బరినూనెతో 5 అద్భుత ప్రయోజనాలు తెలుసా?