Dimple Hayati: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల ఓ పోలీసు అధికారితో గొడవ, కేసులు, కోర్టు దాకా వెళ్లి వార్తల్లో నిలిచింది డింపుల్ హయతి. (Dimple Hayati)
సినిమాల ద్వారా వచ్చే పాపులారిటీ తక్కువే అయినా, వివాదం ద్వారా హాట్ పాపులర్ అయ్యింది డింపుల్. ఈ మధ్యనే ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణుస్వామి ద్వారా ప్రత్యేక పూజలు చేయించి అప్పుడు కూడా వార్తల్లో నిలిచింది డింపుల్.
తాజాగా గ్లామర్ డోస్ పెంచిన డింపుల్.. షర్ట్ బటన్స్ తీసి ఫొటోకు పోజులిచ్చింది. సినిమాల్లో సాధారణంగానే కాస్త గ్లామర్‌గా కనిపించేందుకు ఈ ముద్దుగుమ్మ ఆరాటపడుతుంది.
ఐటమ్స్ సాంగ్స్‌లో ప్రత్యేకత చాటుకోవాలని కోరుకుంటుంది. ప్రత్యేక గీతాల్లో డాన్స్‌కు అభిమానులను తయారు చేసుకుంది డింపుల్.
ఇప్పటి వరకు తొమ్మిది చిత్రాల్లో డింపుల్ హయతి నటించింది. 2017లో గల్ఫ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. అడపాదడపా చాన్సులతో నెట్టుకొచ్చింది.
2019లో విడుదలైన దేవీ 2, అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో ఈ భామ నటించింది. గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి పాపులారిటీ దక్కించుకుంది.
2020లో వచ్చిన యురేకా, 2021లో వచ్చిన హిందీ మూవీ అంత్రగిరే మూవీలో నటించింది. 2022 ఏడాది వీరమే వాగై సూదుం అనే తమిళ సినిమాలో డింపుల్ యాక్ట్ చేసింది.
ఇక అదే సంవత్సరంలో తెలుగులో వచ్చిన ఖిలాడి మూవీలో రవితేజ సరసన చాన్స్ కొట్టేసింది డింపుల్.
ఈ మూవీలో అమాయకపుపాత్ర, తర్వాత చోరీ చేసే పాత్రల్లో నటించి మెప్పించింది. డింపుల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ ఏడాది తొట్టెంపూడి గోపీచంద్ నటించిన రామబాణం చిత్రంలో మెరిసింది. అయితే, ఆ చిత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
పోలీసు అధికారితో రగడ, వేణుస్వామి ద్వారా పూజలు చేయించుకోవడం, సినిమాల్లో చాన్సుల కోసం గ్లామర్ డోస్ పెంచడం లాంటి ఉదంతాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది డింపుల్ హయతి.
Read Also : Nikki Tamboli: శిల్పం లాంటి అందం.. నిక్కీ తంబోలి ఫొటో గ్యాలరీ