శుక్రవారం, 23 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Gold rates today 10-04-2024: దిగిరాని బంగారం ధరలు.. నేడు పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 10 ఏప్రిల్ 2024

Gold rates today 10-04-2024: బంగారం, వెండి ధరలు తగ్గడం లేదు. ఇవాళ బంగారం రేట్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇవీ..

తెలంగాణలోని హైదరాబాద్‌ గోల్డ్‌ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.65,760గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.71,740 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.87,900 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర రూ.65,760 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.71,740 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.87,900 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.66,710 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.

దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ప్రైస్ రూ.65,760గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.71,740 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.65,910 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,890 గా నమోదైంది. జైపూర్‌, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.

మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.30 పెరిగింది. రూ.26,090 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.

ఇవీ చదవండి: JVD at Bhimavaram: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం.. పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశాం : సీఎం జగన్‌
Find My Device: నెట్‌వర్క్‌ లేకున్నా, బ్యాటరీ డెడ్‌ అయినా మీ ఫోన్‌ను కనిపెట్టొచ్చు! ఫైండ్‌ మై డివైజ్‌ అప్‌గ్రేడ్‌..!
Google Pay: మీ ఫోన్‌ పోయిందా? పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే ఎలా వాడాలంటే..!

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading