మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Bigg Boss Telugu 9: ఊహించని కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో.. ఎలిమినేషన్ ఎవరికి?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 11 సెప్టెంబర్ 2025

Bigg Boss Telugu 9: సెప్టెంబర్ 7న జరిగిన గ్రాండ్ లాంచ్‌తో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మొదలైంది. ఈసారి మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్. Bigg Boss Telugu 9

హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారు
సెలబ్రిటీలు: తనూజా పుట్టస్వామి, ఫ్లోరా షైనీ, సంజన గల్రానీ, భరణి శంకర్, శ్రష్టి వర్మ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్ రీతూ చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టి.
కామనర్స్: హరిత హరీష్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్.

నామినేషన్స్ – వారం 1
మంగళవారం జరిగిన నామినేషన్స్‌లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు లిస్ట్‌లో నిలిచారు:
సంజన గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్.

గమనించదగ్గ విషయం ఏమిటంటే – భరణి మినహా మిగతా 8 మంది సెలబ్రిటీలు నామినేట్ అయ్యారు. కామనర్స్‌లో మాత్రం పవన్ ఒక్కరే నామినేషన్స్‌లో నిలిచాడు.

ఓటింగ్ ట్రెండ్స్
ఆన్‌లైన్ ఓటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుత ఫలితాల ప్రకారం:
1వ స్థానం: తనూజా పుట్టస్వామి (23% ఓట్లు)
2వ స్థానం: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (20% ఓట్లు)
3వ స్థానం: సుమన్ శెట్టి – మొదట డల్‌గా ఉన్నా, నామినేషన్ సమయంలో సంజనపై కౌంటర్ ఇచ్చి ఆకట్టుకున్నాడు.
4, 5, 6వ స్థానాలు: డిమోన్ పవన్, రీతూ చౌదరి, రాము రాథోడ్.
7వ స్థానం: సంజన గల్రానీ
8, 9వ స్థానాలు: ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ.

డేంజర్ జోన్
ప్రస్తుతం ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉండటంతో, రాబోయే రోజుల్లో పరిస్థితి మారవచ్చు. మొదటి వారం హౌస్‌ను ఎవరు వీడతారన్న ఆసక్తి పెరిగింది.

ఇవీ చదవండి: Bigg Boss 9 Telugu : అంగరంగ వైభవం.. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss Telugu 9: ల్యాండ్ స్కామ్ ఆరోపణలు.. బిగ్ బాస్ లోకి ఆ బ్యూటీ?

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading