శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Bellamkonda Sai Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి వార్తల్లో ట్విస్ట్.. ఎంగేజ్‌మెంట్ కాదంటూ క్లారిటీ

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 10 మార్చి 2026

Bellamkonda Sai Srinivas: టాలీవుడ్ హీరో Bellamkonda Sai Srinivas ఇటీవల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఇదే నిజమని భావించారు. అయితే ఈ వార్తలపై బెల్లంకొండ శ్రీనివాస్ స్వయంగా స్పందిస్తూ అది ఎంగేజ్‌మెంట్ కాదని స్పష్టం చేశాడు.

సోషల్ మీడియాలో క్లారిటీ
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ శ్రీనివాస్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాము ఇద్దరం కలిసి చేసినది కేవలం ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ మాత్రమే అని చెప్పాడు. నిజమైన నిశ్చితార్థం, పెళ్లి వంటి శుభకార్యాలన్నీ త్వరలో అధికారికంగా జరుగుతాయని వెల్లడించాడు.

ఈ సందర్భంగా కావ్య రెడ్డితో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.
కావ్య రెడ్డికి స్పెషల్ మెసేజ్
తన పోస్టులో కావ్య రెడ్డికి బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో భావోద్వేగంగా ఒక సందేశం కూడా రాశాడు.
“నా కావ్యమ్మకు… జీవితానికి తనకంటూ ఒక అందమైన సమయం ఉంటుంది. నా జీవితంలో ఆ సమయం నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చి నన్ను నమ్మి, నా రోజులను ఎంతో ఆనందంగా, పాజిటివ్‌గా మార్చినందుకు థ్యాంక్స్. నీ ముఖంపై ఉన్న నవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మనం ఎప్పటికీ కలిసుండే ఆ జీవితాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను,” అని రాసుకొచ్చాడు.

ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రముఖ నిర్మాత Bellamkonda Suresh పెద్ద కుమారుడు. ఆయన హీరోగా అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా విజయాలు మాత్రం సాధించలేకపోయాడు.
కెరీర్‌లో వచ్చిన హిట్‌లు
శ్రీనివాస్ కెరీర్‌లో ముఖ్యంగా
రాక్షసుడు
జయ జానకి నాయక
సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇవి ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
గతేడాది కూడా ఆయన కిష్కింధపురి, భైరవం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం పలు ప్రాజెక్టులు
ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే కొత్త సినిమాల ప్రకటనలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత జీవితంలో కావ్య రెడ్డితో ఆయన ప్రేమ వ్యవహారం చాలా కాలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Bellamkonda Srinivas: పెళ్లి బాట పట్టనున్న టాలీవుడ్ యంగ్ హీరో… త్వరలో నిశ్చితార్థం? వ‌ధువు కావ్యారెడ్డి?
Raghu Babu: “గంగిరెడ్డి పాత్రతోనే నా కెరీర్ మలుపు తిరిగింది” – రఘుబాబు ఇంట్రెస్టింగ్ రివిలేషన్స్

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading