Vastu For Kitchen: సాధారణంగా అన్నం వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వంట చేసే వంటగది (Vastu For Kitchen) కూడా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. వంట గది శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడి గది ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో వంట గది కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి.
ఎండు మిరప కాయలు కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి. వంటగదిలో ఉండే ఏ బాక్సులోనూ పురుగులు లేకుండా చూసుకోవాలి. సింకును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ సామాన్లతో నిండిపోయి ఉండరాదు. గ్యాస్ స్టవ్ కూడా ఎప్పుడూ జిడ్డుతో కనిపించకుండా చూసుకోవాలి. గ్యాస్ స్టవ్ కూడా ఏరోజుకారోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే గ్యాస్ సిలిండర్‌పైన డేటు వేయరాదు. (Vastu For Kitchen)
వంటగదిలో ఎప్పుడూ కూడా చక్కటి సుగంధభరిత వాసనలు వచ్చేలా చూసుకోవాలి. ఇంట్లో పోపుల డబ్బా నుంచి మంచి సువాసన రావాలని పెద్దలు చెబుతున్నారు. పోపుల డబ్బాలో వాడే ఆవాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క.. తదితరాలన్నీ ఆయుర్వేద పరంగా రోగాలను దూరం చేసేవి. మనకు వచ్చే చిన్న చిన్న జబ్బులను తొలగిస్తాయి. పోపుల పెట్టె శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగులు పట్టకుండా చూసుకోవాలి.
దుమ్ము లేకుండా చూసుకోవాలి..
బూజు, దుమ్ము లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ వెనుక, పరిసర ప్రాంతాల్లో బూజు, దుమ్ము ఉండరాదట. అన్నింటికంటే ముఖ్యంగా వంట గదిలో బొద్దింక కనిపించకుండా చూసుకోవాలి. దోమలు, ఈగలు వచ్చి వాలినా రోగాలు వ్యాపిస్తాయి. మసిగుడ్డను కూడా శుభ్రంగా ఉతికి జాగ్రత్తగా పెట్టుకోవాలి. మసిగుడ్డ గలీజుగా ఉంటే భార్యా భర్తల మధ్య వివాదాలు వస్తాయని చెబుతున్నారు. లైటర్‌లో సమస్య ఉంటే వెంటనే కొత్తది కొనుక్కోవాలి. వంట సామాన్లు కూడా ఏ పూటకాపూట శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీ దేవత వచ్చి చేరుతుందని పెద్దలు చెబుతున్నారు.
ప్రతి ఇంట్లో వంటగది కీలక పాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం, ఆనందానికి వంట గది దోహదం చేస్తుంది. ఇండియాలోని ప్రజలు సమతుల్యత, సామరస్యాన్ని సాధించడానికి వంటశాలల ప్రత్యేకత పూర్వ నుంచి చెబుతున్నారు. వంట గదిని నిర్మించడంలో వాస్తును ప్రత్యేకమార్గదర్శకంగా చాలా మంది భావిస్తారు. వంటగది కోసం వాస్తు అనేది కొన్ని క్లిష్టమైన చర్యలను పేర్కొనే శాస్త్రంగా చెబుతారు. ఇది అనుసరించినప్పుడు, స్థలం వాతావరణాన్ని మెరుగుపరుస్తుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
వివిధ ఉపకరణాలు, నియమించిన వంట లేదా నిల్వ స్థలాల వ్యూహాత్మక స్థానాలు సామరస్య శక్తి ప్రవాహాన్ని సృష్టిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ శక్తి వెంటనే వండిన ఆహారాన్ని, దానిని తినే వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు. పూర్వం రోజుల్లో, పెరట్లో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసేవారు. ఇంట్లోని ప్రత్యేక పోర్షన్‌లో పాత్రలు శుభ్రం చేసేవారు. సూర్యుని స్థానం, గాలి దిశల ఆధారంగా వాస్తు నియమాలు రూపొందించారు. నేటి మాడ్యులర్ కిచెన్‌లతో కూడా, చాలా మంది ప్రజలు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు.
వంటగది స్థానం, అది ఎదుర్కొనే దిశ, తలుపులు కిటికీల స్థానాలతో సహా అనేక అంశాలకు సంబంధించిన విషయాలను వాస్తు శాస్త్రం అందిస్తుంది. గ్యాస్ సిలిండర్, రిఫ్రిజిరేటర్, సింక్‌ల ప్లేస్‌మెంట్‌తో సహా వంటగది రంగు, గాడ్జెట్‌లు, ఉపకరణాల ప్లేస్‌మెంట్ కోసం వాస్తులో అనేక చిట్కాలను పండితులు సూచించారు.
Read Also : Vastu tips for House Clean: ఇంటి శుభ్రతలో వాస్తు టిప్స్ పాటిస్తే శుభప్రదం..