HomeAstrologyDevotional Tips: ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులివే.. వెంటనే తీసేయండి!

Devotional Tips: ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులివే.. వెంటనే తీసేయండి!

Devotional Tips: ఇంట్లో ప్రమాదకరమైన వస్తువులు ఎప్పుడూ ఉంచుకోరాదు. అలా పెట్టుకోవడం వల్ల ఇంటికి, ఇంట్లో యజమానికి ప్రమాదం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. కుటుంబానికి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో లాఫింగ్‌ బుద్ధ పెట్టుకోవడం వల్ల పరమ దరిద్రం చేకూరుతుందని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. ఏ ఇంట్లో లాఫింగ్‌ బుద్ధ బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతున్నట్లుగా కనపడి మనశ్శాంతి కరువైపోతుందని చెబుతున్నారు.

ఇంట్లోని కొన్ని వస్తువులు నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా కలహాలకు కారణమవుతాయి. ఈ వస్తువులు ఉంచితే ఆ ఇంట్లో కలహాలు వస్తాయి. ఇంట్లో ఉంచకూడని కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం.. చిరిగిన పాత బట్టలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది. ఇది కుటుంబ సభ్యులలో ప్రతికూలతను పెంచుతుందట. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇంట్లో అకస్మాత్తుగా చాలా గొడవలు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాల్లో విబేధాలు తలెత్తుతాయి. ఇది కుటుంబంలో టెన్షన్, కోపం, పగలు పెంచుతుంది. ఇంటి సభ్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి ఇష్టపడరు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదా? అయితే దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అయితే, వాస్తు దోషం కూడా ఒక కారణంగా చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

లాఫింగ్‌ బుద్ధ (Devotional Tips) పెట్టుకోవడం వల్ల వ్యాపారాల్లోనూ నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చైనా వాళ్ల లాఫింగ్‌ బుద్ధ పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టరని స్పష్టం చేస్తున్నారు. ఇది పాషండ మతానికి సంబంధించిన విగ్రహం కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం పెట్టుకోవద్దని చెబుతున్నారు. వ్యాపారాల్లో నష్టాలు, పిల్లలు మాట వినకపోవడం, చెప్పుకోలేని అరిష్టాలు జరుగుతాయని చెబుతున్నారు.

భార్యా భర్తల మధ్య అన్యోన్యం లేకపోవడం, పిల్లలు మాట వినకపోవడం లాంటివి జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. దశావతారాల్లో ఒకటైన బుద్ధావతారం.. గౌతమ బుద్ధుడు ఒకటి కాదని పెద్దలు స్పష్టం చేస్తున్నారు. పాషండ మతానికి చెందిన, హిందూ ధర్మాన్ని, విగ్రహారాధనను ఖండించిన గౌతమ బుద్ధుడు వేరని, హిందూ సంప్రదాయంలో చెప్పుకున్న దశావతారాల్లోని బుద్ధుడు వేరని నిపుణులు సూచిస్తున్నారు. మనవాళ్లంతా తెలియక ఇద్దరూ ఒకే బుద్ధులని అనుకుంటున్నారని చెబుతున్నారు.

ఐరావతం ఏనుగు బొమ్మ పెట్టుకోవచ్చు..

ఇంట్లో ఉంచుకోకూడని అతి ప్రమాదకరమైన బొమ్మ లాఫింగ్‌ బుద్ధ అని చెబుతున్నారు. ఒక వేళ ఇంట్లో లాఫింగ్‌ బుద్ధ ఉంటే.. ఊరి అవతల పడేసి రావాలని చెబుతున్నారు. దాని వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్లిపోతుందని చెబుతున్నారు. పొరపాటున కూడా ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకోరాదని చెబుతున్నారు. దానికి బదులుగా ఐరావతం ఏనుగు బొమ్మను పెట్టుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. లక్ష్మీప్రదంగా ఉంటుందని చెబుతున్నారు. ఏనుగు బొమ్మను పెట్టుకోవడం సకల శుభ ప్రదమని పెద్దలు చెబుతున్నారు.

Read Also : Vastu For Kitchen: వంట గది ఎలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు