Astrology for Credit: ఆ రోజుల్లో అప్పులు చేస్తే జీవితాంతం తీర్చలేరు.. ఎప్పుడో తెలుసా?

Astrology for Credit: నిత్య జీవితంలో చాలా మందికి అప్పడప్పుడూ అప్పు చేయడం లాంటి పనులు చేస్తుంటారు. చేబదుళ్లు కావచ్చు, లోన్లు కావచ్చు, వడ్డీ వ్యాపారుల వద్ద చేస్తున్న అప్పు కావచ్చు.. ఇలా అనేక రకాలుగా అప్పులు చేస్తుంటారు చాలా మంది. ఒకానొక సమయంలో అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితులు ఉంటాయి చాలా మందికి. ఇలాంటి సమయంలో తప్పని సరి పరిస్థితుల్లో అప్పులు చేసేస్తుంటారు. ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు లాంటివి కూడా అప్పుల కిందకే వస్తాయి. (Astrology for Credit)

తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయడం వల్ల ఆ వ్యక్తిలో ఆందోళన ఏర్పడుతుంది. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఒక్కోసారి అప్పులు ఎక్కువైతే వాటిని తీర్చలేక మానసికంగా కుంగిపోతుంటారు. జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం అప్పు తీసుకొనేందుకు కొన్ని సమయాలు, నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం శుభముహూర్తంలో రుణాలు తీసుకోవడం వల్ల సులభంగా తీర్చేయగలరు.

ఏ సమయాల్లో అప్పు చేస్తున్నారో కాస్త గమనించుకోవాలి. అప్పు చేసే ముందు కాస్త ఆలోచించుకోవాలి. వాస్తు శాస్త్రంలో వారంలో కొన్ని రోజులు అప్పు చేయకూడదని చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం వల్ల జీవితాంతం తీర్చడం కష్టం అవుతుందని చెబుతున్నారు. అందుకే సరైన సమయాల్లో మాత్రమే అప్పులు చేయడం ద్వారా త్వరగా తీర్చుకోవడానికి వీలవుతుంది.

మంగళవారం, బుధవారం, శనివారాల్లో అప్పులు చేయరాదని పండితులు చెబుతున్నారు. అలాగే హస్త, మూల, ఆరుద్ర, జ్యేష్ట, విశాఖ, ఉత్తరాఫాల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద, రోహిణి మొదలైన నక్షత్రాల్లో అప్పులు చేయకూడదని స్పస్టం చేస్తున్నారు. ఈ సమయంలో తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుందట.

ఎవరికైనా అప్పు బకాయి ఉంటే మంగళవారం దాన్ని చెల్లించే ప్రయత్నం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇక సోమ, గురు, శుక్ర, ఆది వారాల్లో అప్పులు తీసుకుంటే మంచిదట. ఇవి శుభప్రదమైన రోజులుగా చెబుతున్నారు. స్వాతి, పునర్వసు, ధనిష్ట, శతభిష, మృగశిర, రేవతి, చిత్ర, అనురాధ, అశ్విని, పుష్య నక్షత్రాలలో రుణం తీసుకోవడం వల్ల వాటిని త్వరగా తీర్చుకోవడానికి వీలవుతుందని పండితులు సూచిస్తున్నారు.

సాధారణంగా సరైన ఆర్థిక విధానాలు పాటించని వ్యక్తులే ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే, అప్పు చేయడం మినహా మరోమార్గం లేదన్నప్పుడు బ్యాంకులో రుణం తీసుకోవడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు రుణగ్రహీత ఆదాయ, వ్యయాలు పరిశీలించి, సిబిల్‌ స్కోర్‌ను అనుసరించి రుణ పరిమితిని బ్యాంకులు నిర్ధారణ చేస్తాయి. అంటే, ‘ఇంత మొత్తం అప్పు రుణగ్రహీత కట్టగలడు’ అని పరోక్షంగా ధ్రువీకరించటం జరుగుతుంది.

బ్యాంకు నిర్దేశించిన మొత్తం రుణం పొందడం భారం కాదు. రెండుమూడు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం, ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌ ద్వారా అప్పులు తీసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. బ్యాంక్‌ రుణంతోపాటు ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గరా ఎక్కువ వడ్డీకి అప్పు చేసే స్థాయికి చేరుకోవడం మరీ దారుణం. ఆ వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని స్పష్టమయినట్లే. అయితే, బ్యాంకుల్లో అందరికీ లోన్లు రావు, ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తే అధిక వడ్డీ భారం తప్పదు. మొత్తంగా అప్పు జోలికి పోకుండా ఉండటమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Gold Price Today (22-06-2023): వరుసగా మూడోరోజూ బంగారం నేలచూపులు.. ఇవాళ్టి పసిడి, వెండి ధరలు ఇలా..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles