YSRCP Support to BJP: పార్లమెంటులో బీజేపీకి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మొదటి నుంచి బీజేపీతో సఖ్యతగానే ఉంటున్న వైఎస్ జగన్.. ఇప్పుడు కూడా లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. తాజాగా పార్లమెంటులో విపక్షాలు మోదీ ప్రభుత్వంపై నిరసన స్వరం పెంచాయి. ఇందులో భాగంగా ఎన్డీయే సర్కారుపై అవిశ్వాసం ప్రయోగించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీకి మద్దతుగా ఎవరెవరు ఉంటారనే ప్రశ్నలు రేకెత్తుతున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ వైఖరి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. (YSRCP Support to BJP)
పార్లమెంట్‌లో బీజేపీ కి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజ్యసభలో ఢిల్లీ బిల్లుకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలికింది. లోక్ సభలో మోదీ సర్కార్ పై అవిశ్వాసానికి కూడా వైఎస్సార్‌సీపీ వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే లోక్ సభలో జనవిశ్వాస్ బిల్లు ఆమోదం పొందింది. జనవిశ్వాస్ బిల్లు ద్వారా 42 బిల్లులతో కేంద్రం సవరణ చేసింది. చిన్న చిన్న తప్పులు, నేరాలను శిక్ష నుంచి కేంద్రం మినహాయించింది.
Read Also : Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులకు అభ్యంతరం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ
సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ ఇవాళ చర్చ జరిగింది. చర్చలో వైఎసార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. సినిమా బడ్జెట్ లో అధిక భాగం హీరోల రెమ్యునరేషన్లే అని ప్రస్తావించారు. సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు 200 కోట్ల వరకూ తీసుకుంటున్నారని సభ దృష్టికి తెచ్చారు. సినిమా అంటే హీరో ఒక్కడే కాదని గుర్తుచేశారు. బడ్జెట్ లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేయాలని కేంద్రాన్ని కోరారు. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలంటూ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయం తెలిపారు.
Read Also : Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులకు అభ్యంతరం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ