HomeAndhra PradeshYS Jagan fire on CBN: కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు మీ ఇష్టం.. ఏ...

YS Jagan fire on CBN: కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు మీ ఇష్టం.. ఏ గ్రామన్నైనా తీసుకుందాం..: సీఎం జగన్‌ ఛాలెంజ్‌

YS Jagan fire on CBN: ఈ మధ్య పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు కామెంట్స్‌పై సీఎం వైయస్‌ జగన్‌ రియాక్ట్‌ అయ్యారు. ఒకటే అడుగుతున్నా.. చంద్రబాబును అడుగుతున్నా.. మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నా.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం.. ఏ గ్రామాన్నయినా తీసుకోండి.. ఆ గ్రామంలో, గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే.. గుర్తుకొచ్చేది మీ జగన్. అంటూ సీఎం వ్యాఖ్యానించారు. (YS Jagan fire on CBN) సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

* పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామస్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకొచ్చింది, సచివాలయాలు, పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* ఏ గ్రామమైనా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థతో పింఛన్ పెంచి మరీ ఒకటో తారీఖునే ఇంటికి వచ్చి, సెలవుదినమైనా, ఆదివారమైనా చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పింఛన్ చేతిలో పెడుతున్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికీ అక్కచెల్లెమ్మలు, పేదల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్.

* గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ప్రివెంటివ్ కేర్ లో విప్లవాత్మక మార్పులు తెస్తూ విలేజ్ క్లినిక్ లు పెట్టింది ఎవరంటే మీ జగన్.
* గ్రామ గ్రామాన మహిళా పోలీసులు, ప్రతి అక్క చెల్లెమ్మ సెల్ ఫోన్ లో దిశ యాప్, చూసినా గుర్తుకొచ్చేది మీ జగన్.
* ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* 104, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్.. ఇలా అనేక పథకాలు తీసుకొచ్చింది దివంగత మహానేత వైయస్సార్ అయితే, వాటిని మరో నాలుగు అడుగులుముందుకు వేసి అమలు చేస్తున్నది ఎవరంటే గుర్తుకొచ్చేదిమీ జగన్.

* వైయస్సార్ రైతు భరోసా, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మళ్లీ జీవం పోసింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* అక్కచెల్లెమ్మలు, రైతన్నలకు సున్నా వడ్డీ ఇస్తున్నది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత చూసినా గుర్తుకొచ్చేది మీ జగన్.
* అసైన్డ్ భూముల మీద 22ఏ భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* గ్రామాల్లో గవర్నమెంట్ బడి అయినా సరే, ప్రభుత్వా ఆస్పత్రి అయినా సరే మారడానికి నాడు-నేడు చేస్తున్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.

* గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* గవర్నమెంట్ బడుల్లో డిజిటల్ బోధన, ఐఎఫ్ పీలు, పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్.
* బాబుకంటే మూడు రెట్లు పింఛన్ పెంచింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
* 2.45 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబాలకు పంపింది ఎవరంటే గుర్తుకొచ్చేది మీజగన్.
* ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరిందంటే గుర్తుకొచ్చేది మీ జగన్.

* మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు అన్నా గుర్తుకు వచ్చేది మీ జగన్.
* స్వతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలున్నాయి.
* మీ బిడ్డ హయాంలో 17 కడుతున్నాం.
* 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే మీ బిడ్డ హయాంలో మరో నాలుగు పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం.
* ఇదంతా కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మాత్రమే జరిగింది.

* 14 ఏళ్లు సీఎంగా పని చేసిన పాలనను చూశారు. మీ బిడ్డ నాలుగున్నర సంవత్సరాల పాలన చూశారు.
* కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా, మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నా.
* దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో నిజాయితీగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల మీదగానీ విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి.
* ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి.. ఇది ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
* ఇవన్నీ చూస్తే ఎంత కడుపు మండుతుంది. ఎన్ని జలసిల్ మాత్రలు ఇస్తే కడుపుమంట తగ్గుతుంది.
* అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

* బాబు చేయని అభివృద్ధి ప్రజలకు గుర్తు ఉండకూడదు, జగన్ ఇంటింటికీ చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు. దిక్కుమాలిన కథలు. దిక్కుమాలిన కథనాలు.
* ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్లు, రకరకాల పార్టీలు, వ్యక్తల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి.
* తోడేళ్లందరూ ఏకమై ఒక్క జగన్ మీద ఏకమై యుద్ధం చేస్తున్నారు.
* చంద్రబాబు, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. కారణం.. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు.
* వీళ్లందరూ కూడా నమ్ముకున్నది వంచనను, మోసాన్ని.

* అమలు చేసిన మంచిగానీ, మంచి స్కీములుగానీ ఇవేవీ లేవు కాబట్టే ఏకంగా మోసాలకు, ఈరోజు మేనిఫెస్టో అట.. ఇద్దరూ కలిసి ఇస్తారట.
* రంగు రంగుల వలలతో ప్రజల్నిమోసం చేసేందుకు వస్తారు.
* కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నాడు. ఆరు గ్యారెంటీలన్నాడు. జగన్ ను ఢీకొట్టలేమని డిసైడ్ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజల్ని మోసం చేయాలని బయల్దేరారు.
* ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట.
* ఇలాంటి వారిని నమ్మవచ్చా? అని ఆలోచన చేయాలి.

* ఇలాంటి వారిబుద్ధిని చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది. చెప్పమంటారా?
* ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినుమవేమ అని వేమన స్వామి మాట్లాడారు.
* వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా.
* మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.

Read Also : Jagan on cbn: చంద్రబాబు కేవలం అవినీతి కోసమే అధికారాన్ని ఉపయోగించారు: సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు