Tirumala News 02-09-2023: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,193 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 28,750 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.62 కోట్లు చేకూరిందని టీటీడీ వెల్లడించింది. (Tirumala News 02-09-2023)
రూ. వెయ్యి కోట్ల మార్క్ దాటిన శ్రీవాణి ట్రస్ట్ నిధులు
శ్రీవాణి ట్రస్ట్ నిధులు రూ. వెయ్యి కోట్ల మార్క్ దాటింది. ట్రస్ట్ ప్రారంభించిన 4 ఏళ్లలో వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవడం విశేషం. టికెట్ల విక్రయాలతో రూ.970 కోట్ల విరాళాలు అందాయని టీటీడీ తెలిపింది. వడ్డీతో రూ.35 కోట్ల ఆదాయం చేకూరినట్లు వివరించింది.
పాకాల మండలం నేండ్రగుంటలో కారు భీభత్సం
పాకాల మండలం నేండ్రగుంటలో కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంతో రైల్వే గేటును కారు ఢీకొట్టింది. 3 బైక్ లు ధ్వంసం అయ్యాయి. నలుగురికి తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.
read Also : Adirya L1: నేడు ఆదిత్య-ఎల్1 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో