AP High Court CJ: నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ జస్టిస్ ధీరజ్‌సింగ్ తో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరవుతారు. సీజేగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. (AP High Court CJ)
Read Also : AP DGP: ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు.. వారిని పోలీసు విధులకు వినియోగించవద్దని స్పష్టీకరణ
జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్‌సింగ్.. కుటుంబమంతా న్యాయమూర్తులే కావడం గమనార్హం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పని చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే ధీరజ్‌సింగ్. అత్యంత సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ఆయనకు పేరుంది.
రీసెంట్‌గా బాంబే హైకోర్టులో నంబర్ టూలో కొనసాగారు. సీజేగా 2026 ఏప్రిల్ 24 వరకు పదవీ కాలం ఉంది. ఈలోగా పదోన్నతి వచ్చి అత్యున్నత ధర్మాసనానికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి ఇకపై నంబర్ టూగా కొనసాగుతారు.
Read Also : AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత