బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Counting: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌… ఏర్పాట్లన్నీ పూర్తి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 30 మే 2024

Counting: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న జరగబోయే కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. బుధవారం న్యూ ఢిల్లీ నిర్వాచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కు నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభా నియోజకవర్గాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగేలా ప్రణాళిక సిద్దం చేసుకోవడం జరిగిందన్నారు.

111 నియోజక వర్గాల్లో మద్యాహ్నం 2.00 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు మరియు మిగిలిన 3 నియోజక వర్గాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపుకై టేబుళ్లను పెంచి సకాలంలో వాటి లెక్కింపును కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఏది ఏమైనా రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల తదుపరి కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఎంతో దురదృష్టకరమని, ఓట్ల లెక్కింపు రోజు ఆయా జిల్లాలో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుచున్నదని, 144 సెక్షన్ అమలుతో పాటు సీనియర్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లాలో డిజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, అధికారులతో సమీక్షి నిర్వహించి వారిని అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా పలు జిల్లాలో తాను పర్యటిస్తూ ఓట్ల లెక్కింపుకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం జరుగుచున్నదన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్. బాగ్చీ మాట్లాడుతూ జూన్ 4 న జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా తగు చర్యలు తీసుకునే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీ లను అప్రమ్తతం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.

నితీష్ వ్యాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమర్థవంతమైన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉన్నారని, ఆయన నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజక వర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి జాప్యానికి అవకాశం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఫలితాల ప్రకటనలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరిత గతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి మరియు 21ఇ లను అదే రోజు ఫ్లైట్ లో ECI కి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించ కుండా ఉండేందుకై ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన మార్గ దర్శకాలపై వారికి పూర్తి స్థాయిలో ముందుగానే అవగాహన కల్పించాలన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్లలో కూలీల సేవలను వినియోగించుకునే అంశంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించ వద్దన్నారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి, అనుమతించాలన్నారు. ఎన్నికల తదుపరి పలనాడు జిల్లాలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ జిల్లాలోని అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి దుర్ఘటనలు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు అనుసరిస్తున్న ప్రణాళిక బద్ధమైన చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేస్తున్న బందో బస్తు ఏర్పాట్లను ఆయా నియోజక వర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలిస్ సూపరింటెండెంట్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు వివరించారు.

ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్‌ పోలీసింగ్‌ కోసం సమర్థ్‌ మొబైల్ యాప్‌ తీసుకొచ్చిన ఈసీ
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
EC Alert: ఏపీలో పోలింగ్ తర్వాత హింసతో ఎన్నికల సంఘం అప్రమత్తం
Chevireddy: చంద్రగిరిలో పోలింగ్ అనంతర అల్లర్లపై చెవిరెడ్డి రియాక్షన్ ఇదీ
AP Polling Percentage: ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి 81.86 శాతం పోలింగ్ నమోదు

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading