CM Jagan in Tirupati: మిచౌంగ్ తుపాను బాధితులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. నిన్న తిరుపతి జిల్లాలోని ప్రభావిత గ్రామమైన బాలిరెడ్డిపాలెం గ్రామంలో సీఎం జగన్ తొలుత పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం జగన్ వారితో మాట్లాడారు. సీఎం ఏమన్నారంటే.. (CM Jagan in Tirupati)
* ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్‌తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి.
* దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు.
* మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే.
* దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది.
* దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగింది.
* ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ.
* ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు.
* అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా.
* ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు.
* ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది.
* డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
* 62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
* దాని వల్ల మీ ఇళ్లలో నీళ్లు వచ్చిన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఈ డబ్బుతో కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది.
* ఈరోజు మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 డబ్బులిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు.
* పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు.
* ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం.
* ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం.
* నాలుగైదు రోజుల్లో అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేశారు.
* ఈరోజు నుంచి వారం పట్టొచ్చు. ప్రతి ఒక్కరికీ జరగాల్సినమంచి జరుగుతుంది.
* కరెంటు చాలా ఫాస్ట్‌గా రీస్టోర్ చేశారు. యంత్రాంగం అంతా ఇక్కడే పని చేస్తున్నారు. రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. టీమ్స్ ను మొబిలైజ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంటు రీస్టోర్ అయ్యింది.
* కొన్ని కాలనీల్లో రీస్టోర్ కాని పరిస్థితి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
* కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా రీస్టోర్ అయ్యిందా అనే డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారు.
* అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నా.
* ఇక్కడికి రాకముందు స్వర్ణముఖిలో జరిగిన బ్రీచ్ కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో చూశాను.
* దానికి పర్మినెంట్ సొల్యూషన్ వెతకాలని చెప్పాను.
* హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పారు. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
* హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా.
* జిల్లాలో 110 ట్యాంకులు ఉంటే కొన్ని చోట్ల బ్రీట్చ్ అయ్యాయి.
* రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం.
* రోడ్లు, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి.
* యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి.
* ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు.
* ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది.
* అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది.
* నాలుగైదు రోజుల్లో అన్నీ పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా.
* మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మిగిలిన ప్రాంతాలకు వెళ్లే కార్యక్రమం చేస్తాను.
ఇదీ చదవండి: CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి.. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం
