Ambati on chandrababu: సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాబు అరెస్టు కక్షపూరిత చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు రిమాండ్‌పై మాట్లాడారు. (Ambati on chandrababu)
హెలికాఫ్టర్ లో తీసుకెళతామని చెప్పినా చంద్రబాబు నిరాకరించారని అంబటి గుర్తు చేశారు. పబ్లిసిటీ కోసమే రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలని కోరారన్నారు. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం అని ఆరోపించారు. చంద్రబాబు తన అరెస్టు ను రాజకీయం చేద్దామనుకున్నారని, స్పెషల్ ఫ్లైట్ లో సుప్రీం కోర్టు న్యాయవాదులను రప్పించారన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదని అయన లాయర్లే వాదించలేదన్నారు.
అసలు స్కామ్ జరగలేదని కూడా వాదించలేదని మంత్రి అంబటి పేర్కొన్నారు. 24 గంటల్లో హాజరుపరచలేదని వాదించారన్నారు. తాను నిర్దోషినని మాత్రం చంద్రబాబు కోర్టులో చెప్పలేదన్నారు. ఆధారాలు ఉండడంతోనే కోర్టు రిమాండ్ విధించిందని అంబటి తెలిపారు. కొందరు చవకబారు రాజకీయాలు చేస్తున్నారని అంటి ఫైర్ అయ్యారు. నేరాలు చేయడం చంద్రబాబుకు కొత్త కాదన్నారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్నారని గుర్తు చేశారు.
బాబు అరెస్ట్ తో టీడీపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని, బాబు హయాంలో అనేక స్కామ్ లు జరిగాయని మంత్రి అంబటి వెల్లడించారు. అమరావతి భూములు అనేది పెద్ద స్కామ్ అని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన అన్ని స్కాములపై విచారణ జరిపించాలన్నారు. చట్టం నుంచి ప్రతిసారీ తప్పించుకోలేరని హెచ్చరించారు.
తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు
తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని మంత్రి అంబటి గుర్తు చేశారు. కోర్టు రిమాండ్ మీద బంద్ కు పిలుపునిచ్చారా ? అని ప్రశ్నించారు. ఏదో ఒక ఆందోళనలు సృష్టించాలన్నదే టీడీపీ ఆలోచన అన్నారు. అచ్చెన్నాయుడు ఆడియోతో అంతా బయటకొచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ కి ఇంగిత జ్ఞానం లేదని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి పై గతంలో పవన్ మాట్లాడలేదా ? అని ప్రశ్నలు గుప్పించారు.
ఇవాళ చంద్రబాబు అవినీతి పై ఎందుకు మాట్లాడవు ? అని పవన్‌ను నిలదీశారు మంత్రి అంబటి. ముద్రగడను ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలు చేసినా సమర్ధిస్తావా ? అని ప్రశ్నించారు. అవినీతిపరుడు చంద్రబాబు కు పవన్ మద్దతిస్తున్నారన్నారు. పవన్ తీరును ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పవన్ తన పార్టీని నాశనం చేసుకుని టీడీపీ ని బతికిస్తాడా ? అని అంబటి ప్రశ్నించారు. కోనసీమ జిల్లాలో అల్లర్ల పై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదని తెలిపారు. లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలీదన్నారు. కేసులో ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. చట్టబద్ధంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని మంత్రి అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Sajjala on CBN Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు: సజ్జల