Abul Kalam Azad: ముస్లింల అభివృద్దికి అన్ని రకాలుగా పాటుపడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మైనార్టీలకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు ఇస్తే, తాను మరో అడుగు ముందుకు వేసి నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. మైనార్టీని ఉపముఖ్యమంత్రిగా చేసి తన పక్కన కేబినెట్‌లో కూర్చోబెట్టుకున్నానని పునరుద్ఘాటించారు. భారతరత్న మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. (Abul Kalam Azad)
సీఎం జగన్ మాట్లాడుతూ..
* జాతీయ విద్యాదినోత్సవంగా మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి.
* ముస్లింలలో పేదలందరికీ వైయస్సార్ రిజర్వేషన్ లు అమలు చేశారు.
* గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలని కోరుతున్నా.
* మైనార్టీలకు ఈ ప్రభుత్వం పెద్ద పీట వేసింది.
* గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికి వదిలేసింది.
* డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోంది.
* నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం.
* మైనార్టీలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాం.
* మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశాం.
* సాధికారిత అనేది మాట్లలో కాదు.. చేతల్లో చూపించాం.
* అన్ని రంగాల్లో సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
* మైనార్టీ అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం.
* మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడూ చొరవ చూపలేదు.
* లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం.
* భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం.
* ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
* వెనుకబడిన వర్గాలకు, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చాం.
* అప్పులు కూడా అప్పటి ప్రభుత్వం కంటే ఇప్పుడే తక్కువ.
* రూ.2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్క చెల్లెళ్ల ఖాతాల్లోకి వెళ్తున్నాయి.
* శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం.
* దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ సేవలను స్మరించుకుంటున్నాం.
* బాబు పాలనలో మైనార్టీల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.2,065 కోట్లు.
* గడిచిన 53 నెలల్లో మైనార్టీల కోసం మనం చేసిన ఖర్చు రూ.23,000 కోట్లు.
ఇదీ చదవండి: CS Jawahar Reddy: రక్తహీనత, పౌష్టికాహార లోపాల నివారణకు తక్షణ చర్యలు