HomeBusinessAndroid 18: కీలక మార్పులు.. Gemini తరహా అధికారాలు ఇతర AI అసిస్టెంట్లకూ!

Android 18: కీలక మార్పులు.. Gemini తరహా అధికారాలు ఇతర AI అసిస్టెంట్లకూ!

Android 18: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్‌కు చెందిన Gemini AIకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెమెరా, మైక్రోఫోన్‌, స్క్రీన్‌ కంటెంట్‌, వాయిస్‌ కమాండ్‌, యాప్‌ల నియంత్రణ వంటి సౌకర్యాలను ఇతర ఏఐ అసిస్టెంట్లకూ అందించాలని యూరోపియన్‌ కమిషన్‌ ఆదేశించింది. డిజిటల్‌ మార్కెట్స్‌ యాక్ట్‌ (DMA) కింద జూలై 16న ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలను గూగుల్‌ తన తదుపరి ప్రధాన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ Android 18లో అమలు చేయాలి. 2027 ఆగస్టు 1లోగా ఈ ప్రక్రియ పూర్తికావాలని గడువు విధించింది. European Commission

ఇతర AI అసిస్టెంట్లు ఏం చేయగలవు?

కొత్త విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు తమకు నచ్చిన థర్డ్‌పార్టీ ఏఐ అసిస్టెంట్‌ను వాయిస్‌ కమాండ్‌తో యాక్టివేట్‌ చేయవచ్చు. ఫోన్‌ స్క్రీన్‌పై కనిపిస్తున్న సమాచారాన్ని చదవడం, కెమెరా–మైక్రోఫోన్‌ను ఉపయోగించడం, యాప్‌లను తెరవడం, మెసేజ్‌లు పంపడం, మ్యాప్స్‌ నావిగేషన్‌ ప్రారంభించడం, మీడియాను నియంత్రించడం వంటి పనులను నిర్వహించగలవు. అంతేకాకుండా వినియోగదారు మరో పని చేస్తున్న సమయంలో ఏఐ అసిస్టెంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌ను తెరిచి, స్క్రీన్‌ను పరిశీలించి, ట్యాపింగ్‌–టైపింగ్‌ ద్వారా ట్యాక్సీ బుకింగ్‌ వంటి పనులను పూర్తి చేయవచ్చు. ఒకేసారి పలు ఏఐ అసిస్టెంట్లను హాట్‌వర్డ్‌తో యాక్టివేట్‌ చేసే సదుపాయాన్ని Android 19లో, 2028 ఆగస్టు 1లోగా తీసుకురావాలి.

భద్రతకు సర్టిఫికేషన్‌

స్క్రీన్‌ ఆటోమేషన్‌, యాప్‌లలోని డేటా యాక్సెస్‌, సిస్టమ్‌ సెట్టింగుల నియంత్రణ వంటి సున్నితమైన ఫీచర్ల కోసం ‘క్వాలిఫైడ్‌ ఏఐ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌’ను ఏర్పాటు చేయనున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించే అసిస్టెంట్లకే కొన్ని కీలక అనుమతులు లభిస్తాయి. కెమెరా, మైక్రోఫోన్‌, లొకేషన్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ అసిస్టెంట్లు వినియోగించాలంటే యూజర్‌ అనుమతి తప్పనిసరి. డేటా ఎన్‌క్రిప్షన్‌, ప్రాసెస్‌ ఐసోలేషన్‌ వంటి రక్షణ చర్యలను గూగుల్‌ అమలు చేయవచ్చు.

సెర్చ్‌ డేటా కూడా ప్రత్యర్థులకు

గూగుల్‌ సెర్చ్‌కు సంబంధించిన అనామక క్వెరీలు, క్లిక్‌లు, ర్యాంకింగ్‌ డేటాను అర్హత కలిగిన ప్రత్యర్థి సెర్చ్‌ ఇంజిన్లు, ఏఐ చాట్‌బాట్లకు ఖర్చు ఆధారిత రుసుముతో అందించాలని కూడా ఈయూ ఆదేశించింది. వినియోగదారుల గుర్తింపును బయటపెట్టే వివరాలను తొలగించిన తర్వాతే ఈ డేటాను పంచుకోవాలి. ఈ నిర్ణయం పోటీని పెంచుతుందని ఈయూ చెబుతుండగా, థర్డ్‌పార్టీ యాప్‌లకు శక్తిమంతమైన అనుమతులు ఇవ్వడం ఫోన్‌ భద్రతకు ముప్పుగా మారవచ్చని గూగుల్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Read also: iPhone 18 Pro: ఆపిల్ మాస్టర్ ప్లాన్.. సెప్టెంబర్ లాంచ్‌తో Samsung, Googleకు చెక్?.. అసలు వ్యూహం ఇదే!
Galaxy Watch: Google Play Storeలో Samsung Galaxy Watch 8.. గూగుల్ కొత్త ప్రయోగమా? యూజర్లలో ఆసక్తికర చర్చ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు