Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, తొలి పాట ‘కంసంనిద’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోగా.. తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాయలసీమ కుర్రాడి జీవితంలోకి వచ్చిన కొరియన్ ఆత్మ
టీజర్ ప్రారంభంలోనే కనకరాజు తన రాయలసీమలోని పెనుకొండ గురించి సరదాగా పరిచయం చేస్తాడు. ఊర్లో అల్లరి చేస్తూ తిరిగే యువకుడిగా కనిపించే కనకరాజు జీవితం.. ఓ కొరియన్ యువతిని ప్రేమించిన తర్వాత ఊహించని మలుపు తిరుగుతుంది. అదే సమయంలో కొరియా నుంచి వచ్చిన ఓ రహస్యమైన శక్తి అతడిని ఆవహిస్తుంది. ఆ తర్వాత కనకరాజు పూర్తిగా మారిపోతాడు. అక్కడి నుంచి హారర్, కామెడీ, ఫాంటసీ, యాక్షన్ అంశాలతో కథ ముందుకు సాగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. కొరియన్ ఆత్మతో రాయలసీమ కుర్రాడి కథను మిళితం చేసిన కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
రాయలసీమ యాసలో వరుణ్ తేజ్ అదరగొట్టాడు
కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ చాలా సహజంగా కనిపించారు. ముఖ్యంగా రాయలసీమ యాసలో చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లాంగ్ హెయిర్ లుక్‌లో మాస్ అవతార్‌లో కనిపించిన ఆయన.. చివర్లో ‘కొరియన్ కనకరాజు’గా కనిపించే గెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ టైమింగ్ కూడా టీజర్‌లో హైలైట్ అయింది.
సత్య కామెడీ మరో ప్లస్
హారర్ కామెడీ సినిమాల్లో కామెడీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టీజర్‌లో నటుడు సత్యతో వరుణ్ తేజ్ చేసే సన్నివేశాలు నవ్వులు పంచేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రితికా నాయక్ గ్లామర్.. మేర్లపాక గాంధీ మార్క్ వినోదం
కొరియన్ యువతి పాత్రలో రితికా నాయక్ ఆకట్టుకునే లుక్‌లో కనిపించారు.దర్శకుడు మేర్లపాక గాంధీ తనదైన కామెడీ స్టైల్‌ను మరోసారి చూపించే ప్రయత్నం చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియా కల్చర్‌ను వినోదాత్మకంగా కలిపిన విధానం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
టెక్నికల్‌గా కూడా అదిరిపోయిన టీజర్
టీజర్‌కు టెక్నికల్ టీమ్ కూడా ప్రధాన బలంగా నిలిచింది.
మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ రాయలసీమ ప్రకృతి అందాలు, కొరియాలోని రంగురంగుల లొకేషన్లను అద్భుతంగా చూపించింది.
ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్, యాక్షన్, కామెడీ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది.
సత్య జి ఎడిటింగ్ టీజర్‌ను వేగంగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దింది.
యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయి.
ఆగస్టు 7న థియేటర్లలోకి
‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ అంశాలను సమపాళ్లలో మిళితం చేసిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్‌లో మరో ప్రత్యేక సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ విడుదల చేసిన ‘కొరియన్ కనకరాజు’ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్, కొరియన్ ఫాంటసీ, హారర్ కామెడీ, వరుణ్ తేజ్ కొత్త లుక్, సత్య కామెడీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ కలిసి సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చాయి. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి: Prabhas Fauji OTT Deal: ‘ఫౌజీ’కి రికార్డు ఓటీటీ డీల్?.. ప్రభాస్ సినిమా విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసినట్లు టాక్!
Varun Dhawan : వరుణ్ ధవన్ బర్త్ డే.. సినీ ప్రస్థానం, ఒడిదొడుకులు ఇవీ
