HomeCinemaVishnupriya Instagram: విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్‌పై నెటిజన్ కామెంట్.. యాంకర్ ఇచ్చిన ఒక్క రిప్లై వైరల్.. నెలకు...

Vishnupriya Instagram: విష్ణుప్రియ సబ్‌స్క్రిప్షన్‌పై నెటిజన్ కామెంట్.. యాంకర్ ఇచ్చిన ఒక్క రిప్లై వైరల్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

Vishnupriya Instagram: బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, రియాలిటీ షోల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకంటూ భారీ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రారంభించిన పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ గురించి గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు విమర్శలు, మరోవైపు అభిమానుల మద్దతు మధ్య విష్ణుప్రియ మాత్రం తన స్ట్రాటజీని ఏమాత్రం మార్చడం లేదు. ఇటీవల ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు విష్ణుప్రియ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆమె సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయం గురించి కూడా నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు.

“రేట్ తగ్గించండి అక్కా”.. నెటిజన్ విజ్ఞప్తి
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని విష్ణుప్రియను ఉద్దేశించి..”అక్కా.. సబ్‌స్క్రిప్షన్ ప్రైజ్ కాస్త తగ్గించండి. నేను, నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతాం. మేమంతా జాబ్ లేని కుర్రాళ్లం”అంటూ సరదాగా కామెంట్ చేశాడు. విష్ణుప్రియ సమాధానం.. “చదువుపై దృష్టి పెట్టండిష‌ ఆ కామెంట్‌కు విష్ణుప్రియ కూడా అంతే సరదాగా స్పందించింది.”అయ్యో.. అవునా.. అయితే చదువు మీద శ్రద్ధ పెట్టండి. డబ్బు వృథా చేసుకోవద్దు.”అంటూ రిప్లై ఇచ్చింది.

ఈ ఒక్క సమాధానంతోనే ఆమె సబ్‌స్క్రిప్షన్ ధర తగ్గించే ఆలోచన లేదనే సంకేతం ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆమె సమాధానాన్ని పలువురు మెచ్చుకుంటూ.. “డబ్బు ఖర్చు చేయొద్దని చెప్పడం మంచి మెసేజ్” అని అభిప్రాయపడుతున్నారు.

వివాదాల మధ్య కూడా పెరిగిన సబ్‌స్క్రైబర్లు
విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లో గ్లామరస్ ఫోటోలు, ఎక్స్‌క్లూజివ్ వీడియోలు, ప్రత్యేక కంటెంట్‌ను షేర్ చేస్తోంది. గతంలో ఈ కంటెంట్‌పై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.అయితే ఆ వివాదాల తర్వాత వెనక్కి తగ్గకుండా ఆమె సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించింది. ఆశ్చర్యకరంగా, వివాదాల తర్వాతే ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య మరింత పెరిగిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

నెలకు రూ.390… ఆదాయం ఎంత?
ప్రస్తుతం విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.390గా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆమెకు 6,742 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ సంఖ్య ఆధారంగా లెక్కిస్తే…
సబ్‌స్క్రిప్షన్ ధర: రూ.390 / నెల
సబ్‌స్క్రైబర్లు: 6,742 మంది
మొత్తం గ్రాస్ ఆదాయం: సుమారు రూ.26.29 లక్షలు (నెలకు)
అయితే ఇది గ్రాస్ కలెక్షన్ మాత్రమే. ఇందులో ప్లాట్‌ఫామ్ ఫీజులు, పన్నులు లేదా ఇతర చార్జీలు మినహాయించిన తర్వాతే ఆమెకు అసలు నికర ఆదాయం ఎంత వస్తుందో నిర్ణయించబడుతుంది.

సోషల్ మీడియానే కొత్త ఆదాయ మార్గం
ఒకప్పుడు టీవీ షోలు, ఈవెంట్లపైనే ఆధారపడిన పలువురు సెలబ్రిటీలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా గణనీయమైన ఆదాయం పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్లు, బ్రాండ్ ప్రమోషన్లు, పేడ్ కంటెంట్, రీల్స్, యూట్యూబ్ వంటి వేదికలు ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి.

విష్ణుప్రియ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ తన అభిమానులకు ప్రత్యేక కంటెంట్ అందిస్తూ డిజిటల్ క్రియేటర్‌గా కొత్త దారిలో ముందుకెళ్తోంది.

ఇవీ చ‌ద‌వండి: Vishnu Priya Bhimeneni: విష్ణుప్రియతో ప్రేమ, పెళ్లి రూమర్స్‌పై జేడీ చక్రవర్తి క్లారిటీ… “ఆమె నా శిష్యురాలు మాత్రమే”
Vishnu Priya Bhimeneni: యాంకర్ విష్ణుప్రియపై ఇన్ స్టాగ్రామ్ వీడియోల వివాదం.. సోషల్ మీడియా కంటెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు