NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక N. T. Rama Rao 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, స్టార్ హీరో Jr. NTR నివాళులర్పించడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.
బుధవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తాత ఎన్టీఆర్ సమాధి వద్ద పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం కాసేపు అక్కడే మౌనంగా కూర్చుని తాతతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్లు కనిపించారు. తెల్లటి దుస్తుల్లో వచ్చిన తారక్ చాలా ఎమోషనల్‌గా కనిపించడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో అభిమానుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకుని హీరోను చూసేందుకు పోటెత్తారు. ఈ క్రమంలో ఓ అభిమాని జూనియర్ ఎన్టీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన తారక్.. అతడిని స్వయంగా పైకి లేపి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానుల పట్ల జూనియర్ ఎన్టీఆర్ చూపిన ఆప్యాయతకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను మరింత కదిలించింది. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు సినీ చరిత్రలోనే కాకుండా రాజకీయ చరిత్రలోనూ చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నివాళులర్పించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన భావోద్వేగ పోస్ట్, అభిమానితో చూపిన మానవత్వం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్థంతి సందర్భంగా ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తాతపై తారక్‌కు ఉన్న గౌరవం, అనుబంధం మరోసారి స్పష్టమైందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: Jr. NTR: ప్రశాంత్ నీల్ సినిమాకోసం ఎన్టీఆర్ భారీ ట్రాన్స్‌ఫర్మేషన్.. 10 కిలోలు తగ్గిన తారక్?
Jr NTR Speech: మాటల్లో మెసేజ్.. స్పీచ్‌లతో నెట్టింట ట్రెండ్‌గా జూనియర్ ఎన్టీఆర్
Grand Central Terminal: Apple 50వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం… న్యూయార్క్‌లో అలీషియా కీస్ సర్ప్రైజ్ కాన్సర్ట్
