Sravanthi Chokkarapu: బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు ఒకరు. బిగ్ బాస్ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023లో రెండు సార్లు కంటెస్టెంట్‌గా పాల్గొని తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. విజేతగా నిలవకపోయినా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ఈవెంట్స్‌తో బిజీగా గడుపుతోంది.
వైరల్ అయిన బెట్టింగ్ వీడియో
ఇటీవల స్రవంతికి సంబంధించిన ఓ బెట్టింగ్ ప్రమోషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు.
వివరణ ఇచ్చిన స్రవంతి
ఈ వివాదంపై స్పందించిన స్రవంతి.. వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదని స్పష్టం చేసింది. చాలా కాలం క్రితం చేసిన పాత ప్రమోషన్ వీడియో అని తెలిపింది. ఆ సమయంలో ఈ విషయంపై తనకు సరైన అవగాహన లేకపోవడంతో చేసిన తప్పని కూడా అంగీకరించింది.
కావాలనే వైరల్ చేస్తున్నారని ఆరోపణ
అయితే ఇప్పుడు కావాలనే కొందరు ఆ పాత వీడియోను మళ్లీ బయటకు తీసి తనను టార్గెట్ చేస్తున్నారని స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే సంబంధిత అధికారులకు సమర్పించినట్లు వెల్లడించింది. చట్టపరంగా చేయాల్సిన అన్ని చర్యలు తీసుకున్నానని తెలిపింది.
వీడియోలను రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పాత వీడియోలను చూసి మోసపోవద్దని అభిమానులు, సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా ఆ వీడియో కనిపిస్తే వెంటనే ‘రిపోర్ట్’ చేయాలని చేతులు జోడించి మరీ కోరింది.
ఇవీ చదవండి: Sravanthi anchor: ఓ అర్ధరాత్రి హీరో మెసేజ్‌తో స్రవంతి షాక్.. ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు
Sravanti Chokkarapu: కష్టాల నుంచి కెరీర్ పీక్స్ వరకు… స్రవంతి చొక్కారుపు సక్సెస్ స్టోరీ
Sravana Masam : శ్రావణమాసం విశిష్టత.. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం
