Andhra Pradesh Farmers: దేశంలో మొట్టమొదటిగా రైతుకు పెట్టుబడి సాయం అందింస్తామని ప్రకటించిన వ్యక్తి జగన్ మోహన రెడ్డి గారు.. 2014 లో రాష్ట్రం లో 238 మండలాలు 2015 లో 359 మండలాలు 2016 లో 301 మండలాలు కరువు మండలాల తో రాష్ట్రం లోని రైతులు ఆర్ధిక సంక్షోభం తో ఉన్న సమయంలో రైతులు సకాలంలో క్వాలిటీ విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు సహాయం అవసరం అని 2017 పార్టీ ప్లీనరీలో రైతుకు భరోసా పెట్టుబడి సాయం అందిస్తా మని ప్రకటించారు..
ఆ తరువాత 2018 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం పి యం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 6000 రూ చొప్పున 3 విడతలు 2000 రూ చొప్పున అందిస్తామని ప్రకటించి 2019 జనవరి లో మొదటి విడత 2000 రూ విడుదల చేశారు..
అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి..కానీ అప్పుడు ఇదే పెట్టుబడి సాయం అనే ఆలోచన ఆయనకు రాలా..
జగన్ మోహన రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో లో రైతుకు సంవత్సరానికి 12,500 రూ చొప్పున రెండవ సంవత్సరం నుండి మొదలు పెట్టి రైతుకు 50,000 రూ ఇస్తామని, బీసీ, యస్ సి, యస్ టి, మైనారిటీ కవులు రైతులకు కూడా ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
అధికారం లోనికి రాగానే 4 సంవత్సరాలు హామీని 5 సంవత్సరాలకు, 12,500రూ ను 13,500 కు పెంచి, కవులు రైతులతో పాటు ఆర్ ఓ యఫ్ ఆర్ పట్టాలు ఉన్న రైతులకు కూడా రైతుకు 67,500 రూ క్రమం తప్ప కుండా 5 సంవత్సరాలు అందించడం జరిగినది. కవులు రైతులకు, ఆర్ ఓ యఫ్ ఆర్ పట్టా రైతులకు 13,500 రూ రాష్ట్ర ప్రభుత్వంమే చెల్లించింది. ఇది పి యం కిసాన్ లో లేదు.
జగన్ పాలనలో 53.58 లక్షల మంది రైతులకు
రైతు భరోసా పథకాన్ని అమలు చేసి 34,288 కోట్లు రైతులకు చెల్లించింది..
చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో జగన్ రైతు భరోసా 12,500 ఇస్తానని 7500 రూ ఇచ్చాడు పి యం కిసాన్ రాష్ట్రానికి సంబంధం లేదు నేను అలా కాకుండా రైతుకు 20,000 రూ ఇస్తాను అని పదే పదే ప్రకటించాడు..
ఈ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అన్ని అమలు చేస్తాను..వీటిని మరింత పెంచి, మరింత మందికి కూడా అమలు చేస్తాను అని హామీ ఇచ్చాడు..జగన్ పథకాలనే పేర్లు మర్చి ప్రకటించాడు..
అధికారం లోనికి వచ్చిన తరువాత మొదటి సంవత్సరం 2024-25 లో రైతు భరోసా ఒక్క రూపాయి ఇవ్వలా
కానీ కేంద్ర ప్రభుత్వం పి యం కిసాన్ 17,18,19 విడతలు 2000+2000+2000 చొప్పున విడుదల చేసింది..కానీ ఆ వాయిదాల సమయం లో ఏమీ మాట్లాడ లేదు..
ప్రతి పక్షం లో ఏ దైతే విమర్శించి తన పథకం ప్రకటించి ఇప్పుడు పి యం కిసాన్ ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడే మేము అన్న దాతా సుఖీభవ ప్రధాన మంత్రి గారి సహకారం తో విడుదల చేస్తాము అని ప్రకటించాడు..
నిన్న అన్ని పత్రికలలో 46,85,838 మందికి ఈ సంవత్సరం 8985.41 కోట్లు ఇందులో రాష్ట్ర వాటా 6560.18 కోట్లు కేంద్ర వాటా 2,425.23 కోట్లు అందించామని ప్రకటించారు.
కానీ ఈ ప్రకటనే చుస్తే రాష్ట్ర వాటా 6,560.18 కోట్లు 46,85,838 మందికి 14,000 రూ చొప్పున వస్తున్నది..
కానీ కేంద్ర వాటా 2,425.23 కోట్లు 6000 రూ చొప్పున లెక్కిస్తే 40.42 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది..కేంద్రం విడుదల చేసినది 22 వ విడత..గత సంవత్సరం విడుదల చేసిన 17,18,19 వాయిదాలప్పుడు ఎందుకు గుర్తుకు రాలా..ఆ సంఖ్య ను చూసినా అన్నదాత సుఖీభవ..పి యం కిసాన్ సమన్వయము కాదు..
పథకాల లబ్ది దారుల సంఖ్య ను పెంచి ఇస్తాను అన్న హామీ 53.58 లక్షల సంఖ్యను 46.86 లక్షల సంఖ్య కు తగ్గించడం..
కవులు రైతులకు ఆర్ యఫ్ ఆర్ పట్టాదారుల కు చెల్లింపు ఊసే లేకపోవడం హామీ ని నిలబెట్టు కోవడమా.. ప్రతి పక్షంలో ఉండగా ఇచ్చిన హామీని అధికారం లోనికి వచ్చిన తరువాత నిలబెట్టు కుంటే అది చంద్రబాబు నాయుడు గారు కాదు.. ఇచ్చిన హామీ కి మరింత పెంచి అమలు చేస్తే అది డా. వై యస్ రాజ శేఖర రెడ్ది గారు, జగన్ మోహన రెడ్ది గారు..
కూటమి ప్రభుత్వం మాత్రం
కేవలం 46.86 లక్షల మంది రైతులకు 14000 రూ మాత్రమే
అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేస్తోంది
(జగన్ పాలన 5 ఏళ్లలో
రైతు భరోసా సాయం రూ.34,288 కోట్లు)
కానీ కూటమి ప్రభుత్వం
మొదటి ఏడాది పూర్తిగా ఎగగొట్టింది
అన్నదాత సుఖీభవలో
మొత్తం కౌలు రైతులను ఎత్తేశారు.
రాష్ట్రంలో
రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.
గిట్టు బాటు ధరలు లేవు
ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. రైతులు స్వతం గా ప్రీమియం చెల్లించు కున్న దానికి కూడా ఈ 22 నెలలో రాష్ట్ర వాటా ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించలా.. ఈ రబీ లో రైతులు ప్రీమియం చెల్లించు కుందామన్నా వెబ్ సైట్ ఓపెన్ కాలా.. అంటే వ్యవసాయానికి ఉచిత ఇన్సూరెన్స్ కాదు అసలు ఇన్సూరెన్స్ లేకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది..
ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలకు ఇంతవరకు అతీగతీ లేదు. సున్నావడ్డీ రాయితీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. రైతుల వద్ద అర కొరగా కొనుగోలు చేసిన పొగాకు,ఉల్లి కి 3 నెలల తరువాత డబ్బులు ఇచ్చారు..ఇప్పుడు కొనుగోలు చేసిన కందికి, కొద్దిగా కొనుగోలు చేస్తున్న శనగ కు డబ్బులు ఎప్పటికి ఇస్తారో?
ఇంకా ఈ రబీ లో మొక్కజొన్న, శనగ పంటలకు
మద్ధతు ధర లేకుండా పోవడంతో
ఈ పంటలు ఎక్కువగా సాగు చేసిన
రాయలసీమ, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల
రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
-MVS నాగిరెడ్డి
YSRCP ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్.
Read also: Andhra Pradesh Farmers: వ్యవసాయ రుణాల్లో ఏపీకి రెండో స్థానం.. అప్పుల ఊబిలో రైతులు, పెరుగుతున్న ఆత్మహత్యలు
Andhra Pradesh Farmers: రైతుల బాధలు పట్టని కూటమి సర్కార్.. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల ప్రకటనలు
