India vs Pak: 2026 టీ20 వరల్డ్‌కప్‌లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కు ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 15, 2026న శ్రీలంకలోని R. Premadasa Stadium వేదికగా ఈ హై-వోల్టేజ్ సమరం జరగనుంది.
అయితే రుతుపవనాల ప్రభావంతో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల గత ప్రదర్శన, రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
ప్రేమదాస స్టేడియంలో భారత్ టీ20 రికార్డు
భారత్ ఈ మైదానంలో మొత్తం 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.
అందులో 11 విజయాలు, 4 పరాజయాలు ఉన్నాయి.
పాకిస్తాన్‌తో ఇక్కడ ఒక్కసారి మాత్రమే తలపడగా, 2012లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇక్కడ భారత్ ఓడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు శ్రీలంకపై, ఒకటి ఆస్ట్రేలియాపై వచ్చాయి.
వ్యక్తిగత రికార్డుల పరంగా, ఈ స్టేడియంలో భారత్ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శిఖర్ ధావన్ (284 పరుగులు). బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్ 12 వికెట్లతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అయితే వీరిద్దరూ ప్రస్తుత జట్టులో లేరు.
ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్ టీ20 రికార్డు
పాకిస్తాన్ ఈ మైదానంలో 7 టీ20 మ్యాచ్‌లు ఆడింది.
అందులో 5 విజయాలు, 2 పరాజయాలు ఉన్నాయి.
శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై ఒక్కో మ్యాచ్‌లో ఓడింది.
పాకిస్తాన్ తరపున ఈ వేదికపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఉమర్ అక్మల్ (182 పరుగులు). బౌలింగ్‌లో సయీద్ అజ్మల్ 8 వికెట్లతో టాప్‌గా ఉన్నాడు.
పిచ్ & పరిస్థితులు
ప్రేమదాస స్టేడియం సాధారణంగా స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు మ్యాచ్‌ను మలుపుతిప్పే అవకాశముంది. అదే సమయంలో తడి వాతావరణం, వర్షం ఉంటే ఫాస్ట్ బౌలర్లకు కూడా కొంత సహాయం లభించే అవకాశం ఉంది. టాస్ కీలక పాత్ర పోషించనుంది.
అంచనాలు
భారత్‌కు ప్రేమదాసలో మెరుగైన విజయశాతం ఉంది.
పాకిస్తాన్ కూడా ఇక్కడ మంచి రికార్డే కలిగి ఉంది.
వర్షం ప్రభావం ఉంటే DLS విధానం మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
మొత్తానికి, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్నది కంటే – రెండు జట్ల మధ్య పోరాటం ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందన్నదే అసలైన ఆకర్షణ.
ఇవీ చదవండి: ICC Men’s T20 World Cup 2026 : నమీబియాతో మ్యాచ్ ముందు టీమ్ ఇండియా అనూహ్య నిర్ణయం.. ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ రద్దు
ICC Under 19 World Cup 2026 : భారత్‌కు ఆరో అండర్-19 ప్రపంచకప్ కిరీటం: ఇంగ్లాండ్‌పై 100 పరుగుల ఘన విజయం
