Crime : సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే పిచ్చి ఏ స్థాయికి తీసుకెళ్తుందో మరోసారి రుజువైంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరు ఇంటర్ విద్యార్థులు చేసిన నిర్లక్ష్యపు పనికి ఏకంగా ఒక రన్నింగ్ ట్రైన్‌నే ఆపాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన Kerala రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
వివరాల ప్రకారం… Kannur జిల్లాలో ఇద్దరు ప్లస్ టూ (ఇంటర్) విద్యార్థులు సినిమా స్టైల్ రీల్ షూట్ చేయాలనే ఉద్దేశంతో ప్రమాదకరంగా రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఎర్నాకులం నుంచి పుణేకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేందుకు ట్రాక్‌పై ఎర్రటి లైట్ వెలిగించారు. దీనిని ప్రమాద సంకేతంగా భావించిన లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు.
గురువారం ఉదయం తలస్సేరి–మాహే మధ్య ఈ ఘటన జరిగింది. ట్రైన్ ఆగిన వెంటనే అనుమానం వచ్చిన లోకో పైలట్, ఈ విషయాన్ని RPF మరియు రైల్వే పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు… ట్రాక్ పక్కన నిలబడి విద్యార్థులు రీల్స్ షూట్ చేస్తున్నట్టు గుర్తించారు.
దర్యాప్తు అనంతరం ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం న్యాయ ప్రక్రియ మేరకు వారిని బెయిల్‌పై విడుదల చేశారు. విద్యార్థులు షూట్ చేసిన వీడియోను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో చేసిన ఈ ప్రమాదకర చర్య రైల్వే భద్రతపై తీవ్ర ప్రభావం చూపిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: Reels : బాత్రూమ్‌లో రీల్స్ చూస్తున్నారా? మానుకోవడానికి చిట్కాలు!
Ram Mohan Naidu Reels : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. రామ్మోహన్ నాయుడు రీల్స్‌పై విమర్శలు
