HomeCinemaDivya Bharati : అతన్ని మ్యాడ్‌గా ప్రేమించా.. కానీ ఆ లవ్ నిలబడలేదు! దివ్య భారతి...

Divya Bharati : అతన్ని మ్యాడ్‌గా ప్రేమించా.. కానీ ఆ లవ్ నిలబడలేదు! దివ్య భారతి లవ్ స్టోరీ విన్నారా?

Divya Bharati : దివ్య భారతి… ప్రస్తుతం యూత్‌లో భారీ క్రేజ్ తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ. తక్కువ సినిమాలే చేసినప్పటికీ తన అందం, నటనతో కుర్రాళ్ల మనసులు గెలుచుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది. ఎలాంటి పాత్ర వచ్చినా దానికి పూర్తి న్యాయం చేయడమే దివ్యభారతి స్టైల్‌గా మారింది.

తమిళ సినిమా బ్యాచిలర్తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. హీరో జీవి ప్రకాశ్‌తో చేసిన బోల్డ్ సీన్స్, లిప్‌లాక్ సన్నివేశాలు అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. సుబ్బలక్ష్మీ పాత్రలో ఆమె చూపించిన పెర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత అదే హీరోతో కింగ్‌స్టన్ సినిమాలో మరోసారి మెరిసింది.

1992 జనవరి 28న కోయంబత్తూరులో జన్మించిన దివ్య భారతి, బ్యాచిలర్ సక్సెస్ తర్వాత జర్నీ వెబ్ సిరీస్‌లో నటించి తన నటన పరిధిని విస్తరించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో వరుసగా మూడు నుంచి నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న గోట్ మూవీతో దివ్యభారతి తెలుగుతెరకు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు, విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంలో ఆమె స్పెషల్ రోల్‌లో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్య భారతి, తొలిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన లవ్ స్టోరీని అభిమానులతో పంచుకుంది. కాలేజ్ రోజుల్లో తనకు ఎదురైన ఓ ప్రేమకథను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంగా మాట్లాడింది.

బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఒక వ్యక్తిని తాను ఎంతో ఇష్టపడ్డానని తెలిపింది. అయితే అతను తన కాలేజ్‌లోనే పనిచేసే ప్రొఫెసర్ అని తర్వాతే తెలిసిందని చెప్పింది. వేరే బ్రాంచ్‌కు చెందిన లెక్చరర్ కావడంతో మొదట అది పెద్దగా సమస్యగా అనిపించలేదని పేర్కొంది. ఒకసారి ఇద్దరి చూపులు కలవడంతో పరిచయం మొదలైందని, ఆ తర్వాత తన ఫ్రెండ్ ద్వారా అతను తన నెంబర్ అడిగాడని వివరించింది.

అనుకోకుండా వచ్చిన ఆ ఫోన్ కాల్‌తో వారి మధ్య మాటలు మొదలయ్యాయని, ఆ తర్వాత రోజూ మాట్లాడుకునే స్థాయికి చేరుకున్నామని దివ్యభారతి తెలిపింది. ఇద్దరం ఒకరినొకరు నిజంగా చాలా ఇష్టపడ్డామని చెప్పిన ఆమె, కాలేజ్ పూర్తయ్యాక ఆ ప్రేమకు బ్రేక్ పడిందని వెల్లడించింది.

అయితే ఆ బంధం పూర్తిగా తెగిపోలేదని కూడా దివ్య భారతి చెప్పింది. తన మొదటి సినిమా విడుదలైన తర్వాత అతను కాల్ చేసి అభినందనలు తెలిపాడని, ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి: Priyanka Chopra : పాత జ్ఞాపకాలను నెమరేసుకున్న అమ్మడు.. ప్రియాంక చోప్రా పోస్టులు చూశారా?
Nidhhi Agarwal : 14 ఏళ్లకే ఆల్కహాల్‌కు అలవాటు.. ఆ తర్వాత ఎలాంటి మార్పులొచ్చాయంటే.. హీరోయిన్ నిధి అగర్వాల్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు