HomeTelanganaChicken Price : నాన్‌వెజ్ ప్రియులకు పెద్ద షాక్.. ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు.. కేజీ...

Chicken Price : నాన్‌వెజ్ ప్రియులకు పెద్ద షాక్.. ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు.. కేజీ రూ.300 పైనే!

Chicken Price : 2026 ఏడాది ప్రారంభం చికెన్ ప్రియులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కొద్ది రోజుల క్రితం వరకు కేజీ రూ.200–250 మధ్యలో లభించిన చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ చికెన్ ధర ట్రిపుల్ సెంచరీని దాటి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో నాన్‌వెజ్ అభిమానులు జేబు ఖాళీ అవుతోందంటూ వాపోతున్నారు.

చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధర కూడా వినియోగదారులకు షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర రూ.8కు చేరింది. రోజూ చికెన్, ఎగ్ తీసుకునే కుటుంబాలకు ఈ ధరల పెరుగుదల భారంగా మారింది. “రేట్లు ఇంతలా పెరిగితే ఇక తినేదెలా?” అంటూ వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ ధరలు ఇలా..
బ్రాయిలర్ కోడి మాంసం: కేజీ రూ.300
లైవ్ కోడి: కేజీ రూ.170
ఫారం కోడి మాంసం: కేజీ రూ.180
బండ కోడి మాంసం: కేజీ రూ.280 వరకు

ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా పాయకరావుపేట, నక్కపల్లి ప్రాంతాల్లో సుమారు 450 వరకు కోళ్ల పారాలు ఉన్నాయి. వీటి నుంచి దాదాపు 20 లక్షల వరకు కోళ్లు ప్రతిరోజూ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ కోళ్లు జిల్లాలకే పరిమితం కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయి. అయినప్పటికీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు ఇంతగా పెరగడానికి కారణాలివేనా?
గతంలో బర్డ్ ఫ్లూ భయాలతో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆ సమయంలో ప్రభుత్వ సహకారంతో పౌల్ట్రీ యాజమాన్యాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో వినియోగం మళ్లీ పెరిగింది. దాంతో అప్పట్లో కేజీ చికెన్ ధర రూ.285 వరకు చేరింది. అనంతరం ధరలు క్రమంగా తగ్గి డిసెంబర్ నెలలో రూ.240–250 మధ్యలో స్థిరంగా కొనసాగాయి.

కానీ డిసెంబర్ చివరి వారం నుంచి కొత్త సంవత్సరం మొదటి వారానికి వచ్చేసరికి చికెన్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ చికెన్ రూ.300కు చేరుకోవడంతో వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. వ్యాపారుల మాటల్లో చెప్పాలంటే, సంక్రాంతి పండుగ డిమాండ్, పెరిగిన ఫీడ్ ఖర్చులు, రవాణా వ్యయాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

పండుగ సీజన్ పూర్తయ్యాకైనా ధరలు తగ్గుతాయా? లేదా ఇదే స్థాయిలో కొనసాగుతాయా? అన్నది చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికైతే చికెన్ లవర్స్‌కు ఇది నిజంగా గుండె పగిలే వార్తగానే మారింది.

ఇవీ చదవండి: Chicken vs Fish : చికెన్ వర్సెస్ చేపలు: ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది బలవర్ధక ఆహారం?
Chicken : చికెన్ డైట్ తెచ్చిన ప్రమాదం.. 6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు