AP Government: కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో Andhra Pradesh Government కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. పెండింగ్‌లో ఉన్న పథకాలకు మళ్లీ ప్రాణం పోస్తూ, ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాల్లో అవసరమైన మార్పులు చేస్తోంది. అదే సమయంలో కొత్త పథకాలను ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలో తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా విద్యార్థులకు లబ్ధి చేకూరేలా కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గిరిజన విద్యార్థులకు శుభవార్త
ఏపీలోని గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం న్యూ ఇయర్ వేళ గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి సంబంధించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి Gummadi Sandhya Rani అధికారికంగా ప్రకటించారు.
గత ప్రభుత్వం హయాంలో గిరిజన విద్యార్థులకు అందాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ బకాయిలను క్లియర్ చేస్తూ తాజాగా నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు.
రూ.100 కోట్లకు పైగా నిధులు విడుదల
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను అర్హులైన గిరిజన విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్ నిధులు జమయ్యాయి. మొత్తం 59,297 మంది విద్యార్థులకు రూ.100.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు ఇప్పటికే విద్యార్థుల అకౌంట్లలో జమ అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.
ఈ చర్య వల్ల గిరిజన విద్యార్థుల విద్య మరింత మెరుగుపడుతుందని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయడం ద్వారా విద్యార్థులకు పెద్ద ఊరట కలిగిందన్నారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఇకపై కూడా బకాయిలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తుందని ఆమె హామీ ఇచ్చారు. దీంతో గిరిజన విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు.. ఇప్పుడీ తులం ఎంతంటే?
Vande Bharat: కోస్తా ఏపీకి గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్–చెన్నై! పూర్తి షెడ్యూల్ ఇదే
