HomeCinemaRajinikanth: ఈ 5 తెల్లటి ఆహారాలకు రజనీకాంత్ పూర్తిగా దూరం! 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా...

Rajinikanth: ఈ 5 తెల్లటి ఆహారాలకు రజనీకాంత్ పూర్తిగా దూరం! 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉండటానికి ఇదే సీక్రెట్

Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 70 ఏళ్ల వయసు దాటినా కూడా ఆయన ఎనర్జీ, స్టైల్, డిసిప్లిన్ చూస్తే ఇప్పటికీ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోరు. డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్‌లోనూ అదే చురుకుదనం కనిపిస్తుంది. ఇంత వయసులోనూ ఆయన ఇలా ఫిట్‌గా ఉండటానికి ప్రధాన కారణం… కఠినమైన ఆహార నియమాలు, క్రమశిక్షణ అని వైద్యులు చెబుతున్నారు.

రజనీకాంత్ పాటించే డైట్ సీక్రెట్‌ను చెన్నైకి చెందిన ప్రముఖ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని ఇటీవల వెల్లడించారు. రజనీ ఫిట్‌నెస్‌కు అసలు మూలకారణం ఆయన దూరంగా ఉండే “ఐదు తెల్లటి ఆహారాలు” అని ఆమె తెలిపారు. స్వయంగా రజనీకాంత్ కూడా తాను ఈ తెల్లటి ఆహారాలను పూర్తిగా మానేశానని ఓ వీడియోలో వెల్లడించారు.

రజనీకాంత్ తినని 5 తెల్లటి ఆహారాలు ఇవే
1. తెల్ల చక్కెర (White Sugar)
ప్రాసెస్ చేసిన తెల్ల చక్కెర శరీరానికి అత్యంత హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ స్పైక్‌లకు, పొట్ట కొవ్వు పెరగడానికి, తీపి కోరికలు పెరగడానికి కారణమవుతుంది. రజనీకాంత్ పూర్తిగా చక్కెరకు దూరంగా ఉంటారు.

2. తెల్ల ఉప్పు (White Salt)
అధికంగా తెల్ల ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వవ్వడం, పొట్ట ఉబ్బరం, రక్తపోటు సమస్యలు రావచ్చు. అందుకే రజనీ ఉప్పు వినియోగాన్ని చాలా పరిమితంగా ఉంచుతారు.

3. తెల్ల బియ్యం (White Rice)
తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే బరువు వేగంగా పెరగడానికి దారితీస్తుంది. అందుకే రజనీకాంత్ తెల్ల బియ్యానికి దూరంగా ఉంటూ, అవసరమైతే మితంగా లేదా కూరగాయలతో కలిపి మాత్రమే తీసుకుంటారు.

4. మైదా (White Flour / Maida)
మైదాతో తయారైన ఆహారాలు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. గట్ సమస్యలు, వాపు, బరువు పెరుగుదలకు కారణమవుతాయి. రజనీ పూర్తిగా మైదా ఫుడ్‌కు నో చెబుతారు.

5. పాలు & పాల పదార్థాలు (Milk & Dairy – పరిమితంగా)
కొంతమందిలో పాలు వాపు, గట్ సమస్యలకు కారణమవుతాయి. అందుకే రజనీకాంత్ డైట్‌లో పాల ఉత్పత్తులు చాలా పరిమితంగా ఉంటాయి లేదా పూర్తిగా దూరంగా ఉంటారు.

వైద్యుల హెచ్చరిక
ఈ ఐదు తెల్లటి ఆహారాలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆమ్లత్వం, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రజనీకాంత్ ఈ ఆహారాలను మానేయడం వల్లే వయస్సు పెరిగినా కూడా ఆయన ఎనర్జీ లెవల్స్, ఫిట్‌నెస్ అలాగే కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

ఫిట్‌నెస్‌కు రజనీ ఫార్ములా
ఖరీదైన డైట్స్ కాదు, జిమ్‌లో గంటల కొద్దీ వర్కౌట్స్ కాదు… ఏం తినకూడదో తెలుసుకోవడమే అసలైన ఫిట్‌నెస్ సీక్రెట్ అని రజనీకాంత్ జీవితం నిరూపిస్తోంది. ఈ ఐదు తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటే ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండూ మీ వశమే.

ఇవీ చదవండి: Coolie : రజనీకాంత్ కూలీ మూవీ.. ఈ విషయాలు తెలుసా?
Malaika Arora : వయసు 50 అయినా 30లా కనిపించే మలైకా అరోరా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే! డిటాక్స్ డ్రింక్స్‌పై పూర్తి వివరాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు